Telugu Global
NEWS

కోర్టు బాధలు తప్పేలా.. ఏపీ కొత్త నిర్ణయం

ఏపీ జలవనరుల శాఖ టెండర్ల డాక్యుమెంట్లలో ఒక నిబంధనను చేర్చింది. ప్రస్తుతం ఏపీలో భారీగా పెండింగ్ బిల్లులున్నాయి. వాటి చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోంది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టు వెళ్లి.. బిల్లుల చెల్లింపునకు ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. బిల్లుల చెల్లింపునకు హైకోర్టు డెడ్‌లైన్లు కూడా పెడుతుండడంతో ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అధికారులకు కోర్టు నుంచి ఇబ్బందులూ ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా జలవనరుల శాఖ స్పెషల్ కండిషన్‌ ఆఫ్ నోట్‌ పేరుతో ఒక నిబంధనను చేర్చింది. ప్రభుత్వం […]

కోర్టు బాధలు తప్పేలా.. ఏపీ కొత్త నిర్ణయం
X

ఏపీ జలవనరుల శాఖ టెండర్ల డాక్యుమెంట్లలో ఒక నిబంధనను చేర్చింది. ప్రస్తుతం ఏపీలో భారీగా పెండింగ్ బిల్లులున్నాయి. వాటి చెల్లింపులో తీవ్ర జాప్యం అవుతోంది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు హైకోర్టు వెళ్లి.. బిల్లుల చెల్లింపునకు ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. బిల్లుల చెల్లింపునకు హైకోర్టు డెడ్‌లైన్లు కూడా పెడుతుండడంతో ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అధికారులకు కోర్టు నుంచి ఇబ్బందులూ ఎదురవుతున్నాయి.

ఈనేపథ్యంలో ముందు జాగ్రత్తగా జలవనరుల శాఖ స్పెషల్ కండిషన్‌ ఆఫ్ నోట్‌ పేరుతో ఒక నిబంధనను చేర్చింది. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నప్పుడే బిల్లులు చెల్లిస్తుంది. బిల్లుల చెల్లింపులో ఆలస్యం అయితే దాన్ని కోర్టులో చాలెంజ్‌ చేసే హక్కు కాంట్రాక్టర్లకు ఉండదు. బిల్లులు చెల్లించే వరకు ఎదురుచూడగలిగిన వారే టెండర్లలో పాల్గొనాలంటూ కండిషన్ పెట్టింది.

కృష్ణా డెల్టా పరిధిలోని కాలువల మరమ్మతులకు సంబంధించి 13 కోట్ల రూపాయల టెండర్‌కు ఈ నిబంధన పెట్టారు. ఇలాంటి నిబంధన పెడితే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకొస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఏపీలో దాదాపు లక్షా 50వేల కోట్ల రూపాయల మేర పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయి. వాటి చెల్లింపుపైనే ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదు. అలాంటప్పుడు ఇక కోర్టుకు వెళ్లే హక్కు కూడా వదులుకుని టెండర్లలో పాల్గొంటే పరిస్థితి ఏంటన్న అనుమానం కాంట్రాక్టర్లలో ఈ నిబంధన వలన కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు సాహసం చేయాలి.

First Published:  31 May 2022 8:55 PM GMT
Next Story