Telugu Global
NEWS

అవినీతిపై ఫిర్యాదుకు యాప్.. ప్రారంభించిన సీఎం జగన్

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, అక్రమాలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు. నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే డబ్బులు పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచాలకు అలవాటు పడ్డ కొన్ని శాఖల ఉద్యోగులు తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు సీఎం జగన్ నడుం బిగించారు. ఇందులో భాగంగా అవినీతిపై […]

అవినీతిపై ఫిర్యాదుకు యాప్.. ప్రారంభించిన సీఎం జగన్
X

సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతి, అక్రమాలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారు. నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లోనే డబ్బులు పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచాలకు అలవాటు పడ్డ కొన్ని శాఖల ఉద్యోగులు తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు సీఎం జగన్ నడుం బిగించారు. ఇందులో భాగంగా అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఓ యాప్ తీసుకురావాలని గతంలో అధికారులను ఆదేశించారు.

తాజాగా అధికారులు యాప్‌ను సిద్ధం చేశారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ 14400 అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం ఈ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అవి‌నీతిని నిరోధించడానికి ఈ యాప్​ ద్వారా విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తున్నామని వెల్లడించారు.

కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు, మండల కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, వలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసుల్లో, ఎక్కడైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీ 14400 మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫోన్‌లో యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకొని.. బటన్‌ ప్రెస్‌ చేసి వీడియో ద్వారా కానీ, ఆడియో ద్వారా కానీ సంభాషణను రికార్డు చేస్తే అది నేరుగా ఏసీబీకి చేరుతుందని చెప్పారు. ఏసీబీ నేరుగా సీఎంవోకు నివేదిస్తుందని పేర్కొన్నారు.

అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎస్పీలు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అవినీతి ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉంటుంది. యాప్‌ డౌన్లోడ్‌ చేయగానే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే.. యాప్‌ సిద్ధమవుతుంది.

యాప్‌లో రెండు కీలక ఫీచర్లు ఉంటాయి. యాప్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో, ఫొటోలను నేరుగా లైవ్‌ రిపోర్ట్‌ ఫీచర్‌ను వాడుకుని ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.లాడ్జ్‌ కంప్లైంట్‌ ఫీచర్‌ ద్వారా అవినీతి వ్యవహారానికి సంబంధించి.. ఫిర్యాదుకు తన దగ్గరున్న డాక్యుమెంట్లను, వీడియో, ఆడియో, ఫొటో ఆధారాలను ఏసీబీకి పంపించే అవకాశం ఉంటుంది.

First Published:  1 Jun 2022 9:05 AM GMT
Next Story