Telugu Global
MOVIE UPDATES

విరాటపర్వం రిలీజ్ డేట్ మారింది

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇదివరకు ప్రకటించింది. అయితే ఇప్పుడా విడుదల తేదీ మరింత ముందుకు వచ్చింది. విరాటపర్వం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ […]

virata parvam
X

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 1న విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇదివరకు ప్రకటించింది. అయితే ఇప్పుడా విడుదల తేదీ మరింత ముందుకు వచ్చింది. విరాటపర్వం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది.

1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న పాత్రను పోషించాడు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాటపర్వం ఉండబోతుంది.

ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నాడు. ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

నిజానికి జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ అవ్వాలి. ఊహించని విధంగా ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో, ఆ తేదీకి విరాపటర్వం వస్తోంది. ఇప్పటికే ఆ తేదీకి గాడ్సే సినిమా సిద్ధంగా ఉంది. అయితే అది కూడా వస్తుందా రాదా అనే అనుమానాలున్నాయి. గాడ్సే కూడా వాయిదాపడితే, రానాకు సోలో రిలీజ్ దక్కినట్టే.

First Published:  31 May 2022 12:09 AM GMT
Next Story