Telugu Global
NEWS

ల్యాప్ టాప్ ల వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం

కరోనా కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రమ్ హోమ్, లెర్న్ ఫ్రమ్ హోమ్ లు తెలంగాణలో ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని పెంచింది. Amazon.in ఇటీవల విడుదల చేసిన‌ నివేదిక ప్రకారం, ల్యాప్‌టాప్‌ల డిమాండ్ విషయానికి వస్తే రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ల్యాప్టాప్ ల‌ కొనుగోళ్ళ విషయంలో నగ‌రాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ అగ్రస్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీటితో పాటు చిన్న పట్టణాలైన మెదక్, సిద్దిపేట, జనగాం, మహబూబ్‌నగర్, కోదాడ్ లాంటి చోట్ల కూడా ల్యాప్ […]

ల్యాప్ టాప్ ల వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం
X

కరోనా కాలంలో ప్రారంభమైన వర్క్ ఫ్రమ్ హోమ్, లెర్న్ ఫ్రమ్ హోమ్ లు తెలంగాణలో ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని పెంచింది. Amazon.in ఇటీవల విడుదల చేసిన‌ నివేదిక ప్రకారం, ల్యాప్‌టాప్‌ల డిమాండ్ విషయానికి వస్తే రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.

ల్యాప్టాప్ ల‌ కొనుగోళ్ళ విషయంలో నగ‌రాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ అగ్రస్థానంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీటితో పాటు చిన్న పట్టణాలైన మెదక్, సిద్దిపేట, జనగాం, మహబూబ్‌నగర్, కోదాడ్ లాంటి చోట్ల కూడా ల్యాప్ టాప్ అమ్మకాలు విస్త్రుతంగా సాగుతున్నాయి. HP, Lenovo, Dell, Asus బ్రాండ్లు ఈ ప్రాంతాల్లో బాగా అమ్ముడు పోతున్నాయి

“విద్యా సంస్థల ప్రారంభంతో, ఈ ప్రాంతం నుండి ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ మరింత పెరిగింది. తెలంగాణలోని వినియోగదారులు Amazon.inలో ల్యాప్‌టాప్‌ల కోసం షాపింగ్ చేస్తున్నారు. నో-కాస్ట్ EMI వంటి ఫైనాన్స్ స్కీమ్‌లను ఉపయోగిస్తున్నారు, ”అని అమెజాన్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ అక్షయ్ అహుజా చెప్పారు.

Honor, Redmi, HP మరియు Lenovo వంటి బ్రాండ్‌ల నుండి ఎంట్రీ-లెవల్ ల్యాప్‌టాప్‌లకు కూడా భారీ డిమాండ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఎంట్రీ లెవల్ స్మార్ట్‌వాచ్‌లతో పాటుగా ర్యామ్, హెచ్‌డిడి, ప్రింటర్ ఇంక్ వంటి పిసి కాంపోనెంట్‌లకు కూడా డిమాండ్ పెరుగుతోంది.

First Published:  30 May 2022 9:46 PM GMT
Next Story