Telugu Global
MOVIE UPDATES

శివకార్తికేయన్ తెలుగు సినిమా వచ్చేస్తోంది!

వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన హీరో శివకార్తికేయన్ తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి డైరక్షన్ లో #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. తెలుగు-తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ […]

శివకార్తికేయన్ తెలుగు సినిమా వచ్చేస్తోంది!
X

వరుణ్ డాక్టర్ , కాలేజ్ డాన్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన హీరో శివకార్తికేయన్ తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేస్తున్నాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి డైరక్షన్ లో #SK20 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ సినిమా. తెలుగు-తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

‘కాలేజ్ డాన్’ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై హీరో శివకార్తికేయన్ ని నిర్మాత సురేష్ బాబు అభినందించారు. అలాగే SK20విడుదల తేదీని కూడా ప్రకటించారు. #SK20 చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా తెలుగు, తమిళంలో ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా కథ భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

First Published:  31 May 2022 11:08 AM GMT
Next Story