Telugu Global
NEWS

సిద్ధేశ్వరం అలుగు..? ఇంకెంతకాలం వెనకడుగు..??

కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి డిమాండ్ చేసింది. రాయలసీమ సాగు నీటి సాధన సమితి నేతలు సిద్ధేశ్వరం అలుగు కోసం కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు. రాయలసీమ వెలుగుకోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని, అప్పటి వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని వారు స్పష్టం చేశారు. ఈ అలుగు నిర్మాణం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని […]

సిద్ధేశ్వరం అలుగు..? ఇంకెంతకాలం వెనకడుగు..??
X

కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి డిమాండ్ చేసింది. రాయలసీమ సాగు నీటి సాధన సమితి నేతలు సిద్ధేశ్వరం అలుగు కోసం కృష్ణా నదిలో జలదీక్ష చేపట్టారు. రాయలసీమ వెలుగుకోసం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని, అప్పటి వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని వారు స్పష్టం చేశారు. ఈ అలుగు నిర్మాణం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. టీడీపీ లాగే, వైసీపీ హయాంలో కూడా సిద్ధేశ్వరం అలుగు నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేంటీ అలుగు..?
కృష్ణా జలాలను నిల్వ చేసి, రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. 1951 నాటికే ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపిన ప్రాజెక్ట్ ఇది. ఆ తర్వాత నందికొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తయినా.. కోస్లా కమీషన్ సిఫారసు చేసిన సిద్దేశ్వరం, గండికోట మాత్రం పూర్తి కాలేదు. అలుగు నిర్మాణం పూర్తయితే.. 50 టీఎంసీల నీటి నిల్వకు అవకాశముంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పై భారం కూడా తగ్గుతుంది. తెలుగు గంగ, గాలేరు-నగరి, SRBC లకు నీటి సమస్య పరిష్కారమవుతుంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథ‌కానికి నీటి సమస్య రాకుండా ఉంటుంది. బైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ కు కూడా నీరు ఇచ్చే అవకాశముంది.

ఇన్ని ఉపయోగాలు ఉండటంతో.. “సిద్ధేశ్వరం అలుగు-రాయలసీమ వెలుగు” అంటూ రాయలసీమ సాగు, తాగునీటి ఉద్యమకారులు ఆందోళనలు చేస్తున్నారు. 2016 మే నెల 31 న ఉద్యమకారులే అలుగు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తాము అధికారంలోకి వస్తే అలుగు నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని చెప్పింది. కానీ మూడేళ్లవుతున్నా పనులు ముందుకు సాగడంలేదు. దీంతో ప్రతి ఏడాదీ మే 31న సిద్ధేశ్వరం అలుగు విషయంలో ఉద్యమకారులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా తెలంగాణ లోని కల్వకుర్తి, నంద్యాల జిల్లాను కలుపుతూ కొత్త నేషనల్ హైవే రావడంతో సిద్దేశ్వరం దగ్గర నిర్మించబోతున్న వంతెన కింద అలుగును అతి సులభంగా, చౌకగా నిర్మించుకోవచ్చని అంటున్నారు రాయలసీమ సాగునీటి సాధన సమితి నేతలు. పోలీసు ఆంక్షలు పెట్టినా, తమపై నిఘా ఉంచినా.. నిషేధాజ్ఞలు దాటుకుంటూ తాము అలుగు కోసం ముందుకొచ్చామని, కృష్ణా నదిలో జల దీక్ష చేపట్టామని చెప్పారు. బొజ్జా దశరధరామి రెడ్డి, విరసం అరుణ్, వైఎన్ రెడ్డి, రామ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

First Published:  31 May 2022 9:55 AM GMT
Next Story