Telugu Global
National

నేరాలు, ఘోరాలు.. మధ్యలో సంగీతం..

పంజాబ్ కి చెందిన ప్రముఖ గాయకుడు, సినీ నటుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా మరణంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పంజాబ్ ప్రభుత్వం మూసేవాలాకి సెక్యూరిటీ ఉపసంహరించుకున్న గంటల వ్యవధిలోనే ఆయన్ను దుండగులు మట్టుబెట్టారు. జీప్ లో వెళ్తుండగా కాల్చి చంపారు. అసలు గాయకులపై అంత కక్ష ఎందుకు, ఎవరికి ఉంటుంది..? ఓ సాధారణ గాయకుడిని కాల్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలు పంజాబ్ సంగీత ప్రపంచానికి, నేర సామ్రాజ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? పంజాబ్ […]

Sidhu Moose Wala
X

పంజాబ్ కి చెందిన ప్రముఖ గాయకుడు, సినీ నటుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా మరణంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పంజాబ్ ప్రభుత్వం మూసేవాలాకి సెక్యూరిటీ ఉపసంహరించుకున్న గంటల వ్యవధిలోనే ఆయన్ను దుండగులు మట్టుబెట్టారు. జీప్ లో వెళ్తుండగా కాల్చి చంపారు. అసలు గాయకులపై అంత కక్ష ఎందుకు, ఎవరికి ఉంటుంది..? ఓ సాధారణ గాయకుడిని కాల్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? అసలు పంజాబ్ సంగీత ప్రపంచానికి, నేర సామ్రాజ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

పంజాబ్ లో మ్యూజిక్ ఇండస్ట్రీకి నేర సామ్రాజ్యానికి అవినాభావ సంబంధాలున్నాయి. గాయకులు, సినీ నటులు, ఇతర సెలబ్రిటీలనుంచి కొంతమంది గ్యాంగ్ స్టర్లు డబ్బులు వసూలు చేస్తుంటారు. కొన్నిసార్లు హవాలా సొమ్ము మారకంలో మ్యూజిక్ ఇండస్ట్రీతో ఈ గ్యాంగ్ స్టర్లు సన్నిహితంగా కూడా ఉంటారు. ఈ క్రమంలో సిద్ధూ మూసేవాలాకి కూడా నేర సామ్రాజ్యంతో సంబంధాలు ఏర్పడ్డాయి. శుభ్ దీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలా.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత 2016లో కెనడాకి ఉన్నత చదువులకోసం వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన తన తొలి ఆల్బమ్ విడుదల చేశారు. ఆ తర్వాత భారత్ కి తిరిగొచ్చి వరుసగా మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవారు. అయితే అతని ఆల్బమ్స్ లో హింస, తుపాకుల వాడకం ఎక్కువగా ఉండేది. దీంతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలతో సిద్ధూని జైల్లో కూడా వేశారు. పలుమార్లు లైసెన్స్ లేని గన్ లతో సిద్ధూ పోలీసులకి కూడా చిక్కాడు. ఆ తర్వాత సంజూ అనే మరో ఆల్బమ్ విడుదల చేసి జైలుపాలయ్యాడు. తిరిగొచ్చిన తర్వాత సుఖ్ ఖల్వాన్ అనే గ్యాంగ్ స్టర్ పేరుతో షూటర్ అనే సినిమా చేయబోయాడు, దానిపై పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇలా.. సిద్ధూ మూసేవాలాకి గ్యాంగ్ స్టర్స్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. చివరకి అవి అతడి మరణానికి కారణం అయ్యాయి.

అకాలీదళ్ యువజన విభాగం నేత విక్కీ హత్య కేసులో మూసేవాలాకి ప్రమేయం ఉందని, అందుకే అతడిని చంపేశామంటూ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో కలసి మూసేవాలా హత్యకు కుట్ర పన్నినట్టు తెలిపాడు గోల్డీ బ్రార్. ప్రస్తుతం గోల్డీ కెనడాలో ఉండగా.. లారెన్స్ బిష్ణోయ్ పలు కేసుల్లో నిందితుడిగా తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని అంటున్నారు తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్. పోలీసులు అతడిని విచారణ కోసం తమ కస్టడీలోకి తీసుకున్నారు.

పంజాబ్ లో జగ్గూ భగవాన్ పూనియా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. పలువురు పాప్ సింగర్స్, ర్యాప్ సింగర్స్ కి ఈ గ్యాంగ్ లతో సంబంధాలు ఉండేవి. మొదట్లో తమని తాము రక్షించుకోడానికి గ్యాంగ్ స్టర్స్ తో పరిచయం పెంచుకున్న మ్యూజిక్ ఇండస్ట్రీ వర్గాలు.. క్రమంగా పక్కవారి ప్రాణాలు తీసేందుకు సైతం వెనకాడ్డంలేదు. ఈ గొడవల్లోనే మూసేవాలా హతమయ్యారు. విచిత్రం ఏంటంటే.. అమెరికా ర్యాపర్ తుపక్ షాకూర్ కి నివాళిగా మూసేవాలా ఇటీవల ఓ పాట రూపొందించారు. పాతికేళ్ల వయసులోనే ర్యాపర్ తుపక్ హత్యకు గురయ్యాడు. అతనిపై పాట రూపొందించిన మూసేవాలా కూడా అదే రీతిలో తుపాకి గుండ్లకు బలయ్యాడు.

First Published:  31 May 2022 2:09 AM GMT
Next Story