Telugu Global
National

జూన్ 2న బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్

కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో పటేల్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. పాటిదార్ కోటా ఉద్యమ నేత పటేల్ ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, ఆయన అధికార బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూనే, బీజేపీ సామర్థ్యం, పనితీరును ప్రశంసించారు. జూన్ 2న రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సమక్షంలో హార్దిక్ పటేల్ […]

జూన్ 2న బీజేపీలో చేరనున్న హార్దిక్ పటేల్
X

కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో పటేల్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.

పాటిదార్ కోటా ఉద్యమ నేత పటేల్ ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, ఆయన అధికార బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూనే, బీజేపీ సామర్థ్యం, పనితీరును ప్రశంసించారు.

జూన్ 2న రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ సమక్షంలో హార్దిక్ పటేల్ బిజెపిలో చేరడం ఖాయమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యజ్ఞేష్ దవే తెలిపారు.

పటేల్ 2019లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ నుండి నిష్క్రమించే ముందు, పటేల్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఘాటైన లేఖ రాశారు, దేశంలోని కొన్ని కీలక సమస్యలపై కాంగ్రెస్ అభివృద్ది నిరోధక పాత్రను పోషించిందని, ప్రతిదానిని వ్యతిరేకించే స్థాయికి దిగజారిందని అని హార్దిక్ పటేల్ విమర్షలు గుప్పించారు

First Published:  31 May 2022 4:16 AM GMT
Next Story