Telugu Global

తూచ్….రాజీనామా వెనక్కి తీసుకున్న దివ్యవాణి

సినీ నటి, తెలుగుదేశం అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా వ్యవహారం ముగిసింది. తూచ్… అనేసిన దివ్యవాణి తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. మహానాడులో తనకు అవమానం జరిగిందని, తనను కనీసం మాట్లాడనివ్వలేదని ఓ యూట్యూబ్ ఛానల్ కు దివ్యవాణి ఇంటర్వ్యూ ఇచ్చారు. పైగా వైసీపీ నేతలతో తనకు ఎలాంటి విబాధాలు లేవన్నారు. ఆ తర్వాత దివ్యవాణిని తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ వైరల్ […]

తూచ్….రాజీనామా వెనక్కి తీసుకున్న దివ్యవాణి
X

సినీ నటి, తెలుగుదేశం అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా వ్యవహారం ముగిసింది. తూచ్… అనేసిన దివ్యవాణి తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.

మహానాడులో తనకు అవమానం జరిగిందని, తనను కనీసం మాట్లాడనివ్వలేదని ఓ యూట్యూబ్ ఛానల్ కు దివ్యవాణి ఇంటర్వ్యూ ఇచ్చారు. పైగా వైసీపీ నేతలతో తనకు ఎలాంటి విబాధాలు లేవన్నారు. ఆ తర్వాత దివ్యవాణిని తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ వైరల్ అయింది. అది చూసి దివ్యవాణి తానే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేశారు.

ఈ వ్యవహారం అంతా గందరగోళంగా మారడంతో రంగంలోకి దిగిన కొందరు తెలుగుదేశం పెద్దలు అటు బచ్చుల అర్జునుడుతోనూ ఇటు దివ్యవాణి తోనూ మాట్లాడారు. చివరకు తేలిందేమంటే అసలు బచ్చుల అర్జునుడు అటువంటి ప్రకటనే ఇవ్వలేదని. అదంతా కొంత మంది కావాలని అర్జునుడు పేరుతో అబద్దపు ప్రకటనను వైరల్ చేశారని తేలింది. దివ్యవాణి, అర్జునుడు ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత దివ్యవాణి తన రాజీనామా ట్వీట్ ను తొలగించారు. అయితే.. పార్టీలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని మాత్రం దివ్యవాణి స్పష్టం చేశారు. మొత్తానికి దివ్యవాణి రాజీనామా వ్యవహారం టీ కప్పులో తుఫానులా ముగిసింది.

First Published:  31 May 2022 5:35 AM GMT
Next Story