Telugu Global
NEWS

యువతితో ట్రాప్‌ చేసి వేధింపులు.. శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య

విజయవాడలో చిరువ్యాపారం చేసుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన శ్రీకాంత్ రెడ్డి విజయవాడలో ఉంటుండగా కొన్ని నెలల క్రితం ఒక యువతితో పరిచయం ఏర్పడింది. సదరు యువతి మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధం వరకు వెళ్లింది. పలుమార్లు సెంటర్‌కు తీసుకెళ్లి శ్రీకాంత్ రెడ్డికి సదరు యువతి మసాజ్ చేసేది. శ్రీకాంత్ రెడ్డి తనతో […]

యువతితో ట్రాప్‌ చేసి వేధింపులు.. శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య
X

విజయవాడలో చిరువ్యాపారం చేసుకుంటున్న శ్రీకాంత్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన శ్రీకాంత్ రెడ్డి విజయవాడలో ఉంటుండగా కొన్ని నెలల క్రితం ఒక యువతితో పరిచయం ఏర్పడింది. సదరు యువతి మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధం వరకు వెళ్లింది. పలుమార్లు సెంటర్‌కు తీసుకెళ్లి శ్రీకాంత్ రెడ్డికి సదరు యువతి మసాజ్ చేసేది.

శ్రీకాంత్ రెడ్డి తనతో ఉన్న సమయంలో ఫోటోలను, వీడియోలను సదరు యువతి రహస్యంగా రికార్డు చేసినట్టు మృతుడి ఆరోపించాడు. వాటి సాయంతో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆత్మహత్యకు ముందు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమెకు ములుకోటి సతీష్, చైతన్య, సునీల్‌ అనే ముగ్గురు సహకరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వారే యువతి ద్వారా తనను ట్రాప్ చేశారని వివరించారు.

నలుగురు కలిసి తన నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని.. ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వివరించారు. వారి వేధింపులు భరించలేక.. ఏం చేయాలో తెలియక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి చనిపోయాడు. శ్రీకాంత్ రెడ్డికి వివాహం అయింది. పిల్లలు కూడా ఉన్నారు. వీరి బ్లాక్‌ మెయిల్‌కు భయపడి ఇప్పటికే అప్పులు తెచ్చి శ్రీకాంత్ రెడ్డి డబ్బు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయినా వేధింపులు ఆగకపోవడంతో శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

సెల్ఫీవీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ రెడ్డి చెప్పిన పేర్ల ఆధారంగా వారిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే బాధితుడా లేక ఈ నలుగురు ముఠాగా మారి అమ్మాయి ద్వారా ఇతరులనూ ఇలాగే ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేశారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి, యువతి కలిసి ఉన్న వీడియోలు అనేకం ఉండడంతో వాటిని ఎందుకు రికార్డు చేశారా అన్న దానిపైనా ఆరా తీస్తున్నారు.

First Published:  30 May 2022 4:00 AM GMT
Next Story