Telugu Global
MOVIE UPDATES

ఆ 9 గంటల్లో ఏం జరిగిందో చెప్పిన నందమూరి హీరో

నందమూరి హీరో తారకరత్న ఓటీటీలోకి ఎంటరయ్యాడు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. దీని పేరు 9-అవర్స్. డిస్నీ హాట్ స్టార్ లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ వెబ్ డ్రామాను క్రిష్ నిర్మించాడు. జాకోబ్ వర్గీస్ దర్శకత్వంలో వచ్చింది. ఈ వెబ్ డ్రామాపై ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు తారకరత్న. “ఒక రోజులో 9 గంటల్లో ఏం జరిగిందనేది ఎపిసోడ్ వైజ్ చూపిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్ ను హీరోలా […]

ఆ 9 గంటల్లో ఏం జరిగిందో చెప్పిన నందమూరి హీరో
X

నందమూరి హీరో తారకరత్న ఓటీటీలోకి ఎంటరయ్యాడు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. దీని పేరు 9-అవర్స్. డిస్నీ హాట్ స్టార్ లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ వెబ్ డ్రామాను క్రిష్ నిర్మించాడు. జాకోబ్ వర్గీస్ దర్శకత్వంలో వచ్చింది. ఈ వెబ్ డ్రామాపై ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు తారకరత్న.

“ఒక రోజులో 9 గంటల్లో ఏం జరిగిందనేది ఎపిసోడ్ వైజ్ చూపిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్ ను హీరోలా ఒక పాత్ర లీడ్ చేయదు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి పాత్రలో ఒక భావోద్వేగం కనిపిస్తుంది. ఈ అంశాలు నాకు బాగా నచ్చాయి. బ్యాంక్ దొంగతనం అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే. కథలో ఇంకా కొత్త విషయాలు ఉంటాయి. దర్శకులు నిరంజన్, జాకోబ్ ఇద్దరిలో మంచి ప్రతిభ ఉంది. వాళ్లతో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. నా పాత్ర నుంచి ఎలాంటి ఎమోషన్ కావాలో వాళ్లు బాగా రాబట్టుకున్నారు. ఈ పాత్రలో నటించేందుకు నాకెలాంటి చాలెంజ్ ఎదురు కాలేదు. స్క్రిప్టు పక్కాగా ఉంది, దర్శకుల్లో క్లారిటీ ఉంది కాబట్టి నటుడిగా నా పని సులువైంది.”

ఇలా తన వెబ్ సిరీస్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు తారకరత్న. అన్ని వెబ్ సిరీస్ ల టైపులో ఇందులో బూతులు ఉండవని, ఎలాంటి అసభ్యత లేకుండా కుటుంబసభ్యులంతా కలిసి చూసే విధంగా సిరీస్ తీశామంటున్నాడు. ఒకేసారి మొత్తం వెబ్ సిరీస్ చూసేంత ఆసక్తికరంగా ఉంటుందని కూడా అంటున్నాడు.

ఈ సందర్భంగా తనపై వచ్చిన ఓ పుకారుపై కూడా స్పందించాడు తారకరత్న. మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రంలో తను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఆ సినిమాలో అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానన్నాడు

First Published:  30 May 2022 7:01 AM GMT
Next Story