Telugu Global
NEWS

మంకీపాక్స్ నిర్థారణకు పుణెకి శాంపిల్స్.. తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం

తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన వ్యక్తులనుంచి శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)కి పంపిస్తామని చెబుతున్నారు అధికారులు. అక్కడ వైరస్ నిర్థారణ జరుగుతుందని అంటున్నారు. తెలంగాణలో మంకీపాక్స్ కి సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సూచనల మేరకు తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలిచ్చారు పబ్లిక్ హెల్త్ విభాగం డైరెక్టర్ జి.శ్రీనివాసరావు. శరీరంపై దద్దుర్లు, […]

monkeypox cases in Telangana
X

తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించిన వ్యక్తులనుంచి శాంపిల్స్ సేకరించి పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV)కి పంపిస్తామని చెబుతున్నారు అధికారులు. అక్కడ వైరస్ నిర్థారణ జరుగుతుందని అంటున్నారు. తెలంగాణలో మంకీపాక్స్ కి సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సూచనల మేరకు తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలిచ్చారు పబ్లిక్ హెల్త్ విభాగం డైరెక్టర్ జి.శ్రీనివాసరావు. శరీరంపై దద్దుర్లు, దురద వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

21 రోజుల్లో ఎప్పుడైనా బయటపడే అవకాశం..

మంకీపాక్స్ అనేది వైరస్ ద్వారా వచ్చే ఒక అంటు వ్యాధి. మశూచి కుటుంబాన్నుంచే ఇది కూడా ఉద్భవించిందని చెబుతున్నారు. వైరస్ వచ్చినవారితో సన్నిహితంగా ఉండటం, ఒకే గదిలో ఉండటం, ఒకే మంచంపై పడుకోవడం, ఒకరు వాడిన వస్తువుల్ని వేరొకరు ఉపయోగించడం, వారి చర్మం నుంచి వచ్చే రసిక లేదా.. చర్మం నేరుగా తగలడం వంటి కారణాల వల్ల మంకీపాక్స్ ఒకరినుంచి ఇంకొకరికి సులభంగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ లక్షణాలున్నట్టుగా నిర్థారణ అయితే.. ఆయా వ్యక్తులకు 21 రోజుల్లో కాంటాక్ట్ లోకి వచ్చిన వ్యక్తులను కూడా పరీక్షించాల్సిందే. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుమానుతులుంటే వెంటనే వారి శాంపిల్స్ సేకరించాలని, వారిని ఐసోలేషన్లో ఉంచాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలిచ్చారు.

మంకీపాక్స్ వల్ల చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంది. ఆ తర్వాత కొత్త చర్మం వచ్చేంత వరకు వైరస్ శరీరంలో ఉన్నట్టే లెక్క. వైద్య పర్యవేక్షణ అవసరం లేదని డాక్టర్లు నిర్థారిస్తే.. వారిని ఐసోలేషన్ నుంచి ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కేసు కూడా అధికారికంగా నిర్థారణ కాలేదు. అనుమానితులు ఉంటే వెంటనే వారినుంచి శాంపిల్స్ సేకరించాలని, వారిని ఐసోలేషన్లో ఉంచాలని అధికారులు వైద్య సిబ్బందికి ఆదేశాలిచ్చారు. మంకీపాక్స్ ప్రబలిన 20దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు చేసి విమానాశ్రయాలనుంచి లోపలికి అనుమతిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని చెబుతున్నారు నిపుణులు. పదేళ్లుగా ఇది అక్కడక్కడా కనపడుతూనే ఉందని అంటున్నారు. కానీ కరోనా వైరస్ కల్లోలం తర్వాత ఏ వైరస్ పేరు చెప్పినా ప్రజలు వణికిపోతున్నారు. అలాగే ఇప్పుడు మంకీపాక్స్ పేరు కూడా అందర్నీ కలవరపెడుతోంది.

First Published:  30 May 2022 6:50 AM GMT
Next Story