Telugu Global
National

ఏనుగుల లెక్కల కోసం డీఎన్ఏ పరీక్షలు

ఏనుగులు అడవుల్లో ఉంటాయి. కీకారణ్యాల్లో ఎవరికీ కనిపించకుండా సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడు జనావాసాల దగ్గరకు కూడా వస్తుంటాయి. ఓచోట కుదురుగా ఉండకుండా.. నిత్యం అడవుల్లో అవి గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూనే ఉంటాయి. జంతు ప్రదర్శన శాల (జూ)లో ఏనుగులకు లెక్క ఉంటుంది కానీ, అడవుల్లో ఏనుగుల సంఖ్యను ఎలా లెక్కపెడతారు..? దానికి కూడా ఓ లెక్క ఉంది. విరిగిన చెట్ల కొమ్మలు, పాద ముద్రలు, ఏనుగు పేడ.. ఇటీవల సీసీ కెమెరాల రికార్డుల ఆధారంగా ఏనుగులను లెక్కిస్తున్నారు. అయితే […]

ఏనుగుల లెక్కల కోసం డీఎన్ఏ పరీక్షలు
X

ఏనుగులు అడవుల్లో ఉంటాయి. కీకారణ్యాల్లో ఎవరికీ కనిపించకుండా సంచరిస్తుంటాయి. అప్పుడప్పుడు జనావాసాల దగ్గరకు కూడా వస్తుంటాయి. ఓచోట కుదురుగా ఉండకుండా.. నిత్యం అడవుల్లో అవి గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూనే ఉంటాయి. జంతు ప్రదర్శన శాల (జూ)లో ఏనుగులకు లెక్క ఉంటుంది కానీ, అడవుల్లో ఏనుగుల సంఖ్యను ఎలా లెక్కపెడతారు..? దానికి కూడా ఓ లెక్క ఉంది. విరిగిన చెట్ల కొమ్మలు, పాద ముద్రలు, ఏనుగు పేడ.. ఇటీవల సీసీ కెమెరాల రికార్డుల ఆధారంగా ఏనుగులను లెక్కిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో తప్పులు నమోదవుతున్నాయనే అనుమానం కూడా ఉంది. ఒకే ఏనుగుని పలుమార్లు లెక్కల్లోకి తీసుకోవడంతో వాటి సంఖ్యను సరిగా లెక్కించలేకపోతున్నామనే భావన అధికారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా డీఎన్ఏ టెస్ట్ లను ఎంచుకోబోతున్నారు అధికారులు.

ఏనుగు పేడను డీఎన్ఏ పరీక్షలకు పంపించి డీఎన్ఏ ప్రొఫైల్ ద్వారా ఏనుగుల సంఖ్యను లెక్కబెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 2022కి సంబంధించి ఈ లెక్కలను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకూ తొండం, దంతాలు, చెవుల సైజులను బట్టి వాటిని వేరు చేసేవారు. డీఎన్ఏ శాంపిల్స్ వస్తే డూప్లికేట్ ఎంట్రీకి అస్సలు అవకాశమే ఉండదని అంటున్నారు నిపుణులు.

2017 గణాంకాల ప్రకారం భారత్ లో 27వేల ఏనుగులున్నాయి. కర్నాటకలో అత్యథికంగా 6049 ఏనుగులు ఉన్నాయి. అసోంలో 5719 ఏనుగులు ఉండగా, కేరళలో 3054 ఏనుగులు సంచరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2012లో ఏనుగుల సంఖ్య కంటే 2017లో తీసిన లెక్కలు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ లెక్కల్లో గందరగోళం ఉందని అధికారులే చెప్పడం గమనార్హం. గుంపులు గుంపులుగా సంచరించే ఏనుగులు అడవుల్లో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సులభంగా తరలిపోతుంటాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం.. రెండూ ఆ ఏనుగులను తమ లెక్కలో వేసుకుంటోంది.

ఇక ఇటీవల కాలంలో జన సంచారం ఉన్న ప్రాంతాల్లోకి కూడా ఏనుగులు చొచ్చుకుని వస్తున్నాయి. పంటపొలాలను నాశనం చేసే క్రమంలో మనుషులు వీటికి అడ్డువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. 2020లో మనుషులు-ఏనుగుల కొట్లాటలో 359 మంది ప్రజలు చనిపోగా.. 87 ఏనుగులు మరణించాయి. 2019లో ఇలాంటి ఘటనల ద్వారా 585మంది మనుషులు చనిపోగా.. 19 ఏనుగులు చనిపోయినట్టు రికార్డుల్లో ఉంది. అయితే ఏనుగుల సంతతి లెక్కింపులో మాత్రం ఇప్పటి వరకూ ఓ స్థిరమైన విధానం లేదు. ఈఏడాది అమలులోకి తీసుకొచ్చే డీఎన్ఏ ప్రొఫైలింగ్ తో లెక్కలు పక్కాగా ఉంటాయని నమ్ముతున్నారు అధికారులు.

First Published:  30 May 2022 6:02 AM GMT
Next Story