Telugu Global
NEWS

రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది. రెడ్ల సింహ గర్జన సభలో ఆయనకీ చేదు అనుభవం ఎదురయ్యింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి.. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్‌ను, టీఆర్ ఎస్ ను పొగుడుతూ మాట్లాడటంపై సభికులు అడ్డు తగిలారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై […]

రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి
X

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కాన్వాయ్ పై దాడి జరిగింది. రెడ్ల సింహ గర్జన సభలో ఆయనకీ చేదు అనుభవం ఎదురయ్యింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మల్లారెడ్డి.. తన ప్రసంగంలో పదే పదే సీఎం కేసీఆర్‌ను, టీఆర్ ఎస్ ను పొగుడుతూ మాట్లాడటంపై సభికులు అడ్డు తగిలారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు ఆగ్రహించిన మంత్రి.. మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆయన వాహనంపై కుర్చీలు, వాటర్‌ బాటిళ్లతో దాడి చేశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.

ముందు మాట్లాడిన మల్లారెడ్డి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలను చెప్పుకొచ్చాడు. అయితే సభికులు గట్టిగా అరుస్తూ 5 వేల కోట్లతో ఏర్పాటు చేస్తానన్న రెడ్డి కార్పొరేషన్‌ ఏమైందని ప్రశ్నించారు. మల్లా రెడ్డి దానికి జవాబు చెప్పకుండా దళిత బందు ఇస్తున్నారని , అన్ని కులాలకు కార్పోరేషన్లు భవనాలు ఇస్తున్నారని చెప్పారు. సభికులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకొని ఇప్పుడు దళిత బంధు గురించి ఎందుకని ప్రశ్నించారు. అయినా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించడంతో సభికులు కుర్చీలు, చెప్పులు విసిరి నిరసన తెలిపారు. దాంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆయనను అక్కడి నుంచి తీసుకెళ్ళారు.

అయినప్పటికీ ఆగని సభికులు మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన వాహన శ్రేణిపై కూడా దాడి చేశారు. మంత్రి వాహనం వెంట పరుగులు తీస్తూ వాటర్‌ బాటిళ్లు, కుర్చీలు విసిరారు.

First Published:  29 May 2022 8:28 PM GMT
Next Story