Telugu Global
MOVIE UPDATES

కోటికొక్కడు రిలీజ్ డేట్ ఫిక్స్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా, శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా విడుదల […]

కోటికొక్కడు రిలీజ్ డేట్ ఫిక్స్
X

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా, శివ కార్తిక్‌ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్‌ శ్రీనివాస్‌, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది.

సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో ఓ మోస్తరు అంచనాలున్నాయి. సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

మడోన్నా సెబాస్టియన్‌, శ్రద్ధాదాస్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ లో బాగంగా మరో మూడు పాటలని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

First Published:  30 May 2022 7:03 AM GMT
Next Story