Telugu Global
National

జూలై, ఆగస్టుల్లో భారత్ లో తీవ్ర కరెంట్ సంక్షోభం

దేశంలోని విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నందువల్ల జూలై, ఆగస్ట్ నాటికి దేశంలో తీవ్ర కరెంట్ సంక్షోభం తప్పదని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘ది సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్స్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ ఆఫ్ ఇండియా’ (CREA) తెలిపింది. ప్రస్తుతం పవర్ స్టేషన్‌లలో బొగ్గు నిల్వలు 13.5 మిలియన్ టన్నులు మాత్రమే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పవర్ ప్లాంట్ల వద్ద 20.7 మెట్రిక్ టన్నులు ఉన్నాయని CREA […]

జూలై, ఆగస్టుల్లో భారత్ లో తీవ్ర కరెంట్ సంక్షోభం
X

దేశంలోని విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నందువల్ల జూలై, ఆగస్ట్ నాటికి దేశంలో తీవ్ర కరెంట్ సంక్షోభం తప్పదని స్వతంత్ర పరిశోధనా సంస్థ ‘ది సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్స్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ ఆఫ్ ఇండియా’ (CREA) తెలిపింది.

ప్రస్తుతం పవర్ స్టేషన్‌లలో బొగ్గు నిల్వలు 13.5 మిలియన్ టన్నులు మాత్రమే ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పవర్ ప్లాంట్ల వద్ద 20.7 మెట్రిక్ టన్నులు ఉన్నాయని CREA నివేదిక తెలిపింది.

ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ కొద్దిగా పెరిగినా ఆ పరిస్థితిని తట్టుకునే శక్తి లేదని, బొగ్గు రవాణా కోసం ముందుగానే సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని ఆ సంస్థ తెలిపింది.

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ( CEA) ఆగస్టులో 214 గిగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది. అదనంగా, సగటు ఇంధన డిమాండ్ కూడా మే నెలలో ఉన్న దానికంటే 1,33,426 మిలియన్ యూనిట్లకు పెరగవచ్చు. దీనికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండకపోవచ్చని CEA సైతం అభిప్రాయపడింది.

“నైరుతి రుతుపవనాల ఆగమనం వల్ల గనుల నుండి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా మరింత కష్టతరమవుతుంది. రుతుపవనాలకు ముందే విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలను తగిన స్థాయిలో నింపకపోతే, జూలై-ఆగస్టు 2022లో దేశం మరో విద్యుత్ సంక్షోభం వైపు పయనించే అవకాశం ఉంది. ” అని CREA చెప్పింది.

దేశంలో ఇటీవల ఏర్పడిన విద్యుత్ సంక్షోభం బొగ్గు ఉత్పత్తి జరగక పోవడం వల్ల కాదని పంపిణీ సరిగా లేకపోవడం, అధికారిక ఉదాసీనత కారణంగా స౦క్షోభ వచ్చిందని CREA రిపోర్ట్ పేర్కొం ది.

” పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు రవాణా, నిర్వహణ సరిపోలేదని డేటా స్పష్టంగా తెలియజేస్తోంది… తగినంత బొగ్గు మైనింగ్ ఉన్నప్పటికీ థర్మల్ పవర్ స్టేషన్‌లలో తగినంత నిల్వ లేదు” అని అది పేర్కొంది.

‘‘ప్రస్తుత పరిస్థితి ఈ మధ్య కాలంలో మొదలైంది కాదు… మే 2020 నుంచి పవర్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.” అని CREA చెప్పింది

“నైరుతి రుతుపవనాల ప్రారంభానికి ముందే తగినంత బొగ్గును నిల్వ చేయకుండా పవర్ ప్లాంట్ ఆపరేటర్లు నిష్క్రియాత్మకంగా వ్యవహరించడమే గత సంవత్సరం విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణం. రుతుపవనాల వల్ల‌ బొగ్గు గనులను వరదలు ముంచెత్తుతాయి. బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ కేంద్రాలకు రవాణా చేయడంలో ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగానే బొగ్గును విద్యుత్ ప్లాంట్ లకు తరలించడం చాలా కీలకం.” అని నివేదిక పేర్కొంది.

First Published:  30 May 2022 1:35 AM GMT
Next Story