Telugu Global
MOVIE UPDATES

ఎఫ్3 తొలి వారాంతం వసూళ్లు

ఓ సినిమాకు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయంటే దానర్థం, ప్రేక్షకులు ఆ సినిమాను చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారని. చాలా అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలు, ఎఫ్3 విషయంలో నిజమయ్యాయి. ఈ సినిమాకు రెండో రోజు కంటే, మూడో రోజు వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. ఎఫ్3 సినిమాకు మొదటి రోజు 10 కోట్లకు పైగా షేర్ వస్తే, రెండో రోజు షేర్ 8.35 కోట్లు వచ్చింది. మూడో రోజు ఆదివారం ఈ సినిమాకు […]

ఎఫ్3 తొలి వారాంతం వసూళ్లు
X

ఓ సినిమాకు రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయంటే దానర్థం, ప్రేక్షకులు ఆ సినిమాను చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారని. చాలా అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలు, ఎఫ్3 విషయంలో నిజమయ్యాయి. ఈ సినిమాకు రెండో రోజు కంటే, మూడో రోజు వసూళ్లు ఎక్కువగా వచ్చాయి.

ఎఫ్3 సినిమాకు మొదటి రోజు 10 కోట్లకు పైగా షేర్ వస్తే, రెండో రోజు షేర్ 8.35 కోట్లు వచ్చింది. మూడో రోజు ఆదివారం ఈ సినిమాకు ఏకంగా 8 కోట్ల 85 లక్షల రూపాయల షేర్ రావడం విశేషం. అలా ఎఫ్3 విషయంలో మౌత్ టాక్ బాగా పనిచేసింది.

ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. మొదటి వారాంతం ఈ సినిమాకు 27 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ వసూళ్లతో ఈ సినిమా అటుఇటుగా 3 రోజుల్లో 40శాతం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. ఏపీ, నైజాంలో ఎఫ్3 సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 12.20 కోట్లు
సీడెడ్ – రూ. 3.59 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.36 కోట్లు
ఈస్ట్ – రూ. 1.88 కోట్లు
వెస్ట్ – రూ. 1.54 కోట్లు
గుంటూరు – రూ. 2.06 కోట్లు
కృష్ణా – రూ. 1.77 కోట్లు
నెల్లూరు – రూ. 1.15 కోట్లు

First Published:  30 May 2022 9:13 AM GMT
Next Story