Telugu Global
National

చార్ థామ్ కొత్త రూల్.. ఫిఫ్టీ దాటితే ఫిట్ నెస్ పరీక్ష పాసవ్వాల్సిందే..

అటు తీర్థయాత్ర, ఇటు సాహస యాత్ర.. రెండూ కలగలిపినదే చార్ థామ్ యాత్ర. బద్రీనాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ప్రాంతాలను ఒకేసారి దర్శించడంకోసం ఉత్తరాఖండ్ కి వెళ్తుంటారు యాత్రికులు. కరోనా కారణంగా వరుసగా రెండేళ్లపాటు చార్ థామ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది అనుమతి ఇచ్చింది. అయితే ఈ సారి మరో కొత్త చిక్కొచ్చిపడింది. 50 ఏళ్లు పైబడినవారికి నో ఎంట్రీ అని చెప్పేస్తున్నారు ఉత్తరాఖండ్ అధికారులు. వయసుపైబడినవారు యాత్రకు రావాలంటే ఫిట్ […]

చార్ థామ్ కొత్త రూల్.. ఫిఫ్టీ దాటితే ఫిట్ నెస్ పరీక్ష పాసవ్వాల్సిందే..
X

అటు తీర్థయాత్ర, ఇటు సాహస యాత్ర.. రెండూ కలగలిపినదే చార్ థామ్ యాత్ర. బద్రీనాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ప్రాంతాలను ఒకేసారి దర్శించడంకోసం ఉత్తరాఖండ్ కి వెళ్తుంటారు యాత్రికులు. కరోనా కారణంగా వరుసగా రెండేళ్లపాటు చార్ థామ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది అనుమతి ఇచ్చింది. అయితే ఈ సారి మరో కొత్త చిక్కొచ్చిపడింది. 50 ఏళ్లు పైబడినవారికి నో ఎంట్రీ అని చెప్పేస్తున్నారు ఉత్తరాఖండ్ అధికారులు. వయసుపైబడినవారు యాత్రకు రావాలంటే ఫిట్ నెస్ పరీక్ష పాసవ్వాల్సిందేనంటున్నారు.

వయసు పైబడినవారు, ఆరోగ్యం బాగోలేనివారు, ఇతరత్రా శారీరక మానసిక సమస్యలున్నవారు, పెళ్లి కావాల్సిన వారు, పిల్లలు కోరుకుంటున్నవారు.. ఇలా దేవుడు గుడికి వచ్చేవారిలో చేలా కేటగిరీలు ఉన్నాయి. సహజంగా వయసుపైబడినవారు తీర్థయాత్రలకు వెళ్తుంటారు. కానీ ఇక్కడ చార్ థామ్ యాత్రికులకు వయసే అడ్డంకిగా మారుతోంది. వయసుపైబడినవారు యాత్రకు వచ్చి అనారోగ్యం పాలవడంతోపాటు, కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈఏడాది యాత్ర ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటి వరకు 101మంది యాత్రికులు వివిధ అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. దీంతో ఉత్తరాఖండ్ వైద్యశాఖ అధికారులు ఈ రూల్ తప్పనిసరి చేశారు. రుద్రప్రయాగ్ దగ్గరే యాత్రికుల్ని ఆపేస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఫిట్ నెస్ ఉన్నవారిని మాత్రమే పంపిస్తున్నారు. కొంతమంది ఈ నిబంధన వల్ల అధికారులతో గొడవ పడుతున్నారు కూడా. అయితే యాత్రికుల ఆరోగ్యం, భద్రత కారణాల దృష్ట్యా.. 50 ఏళ్లు పైబడినవారందరికీ ఫిట్ నెస్ పరీక్ష తప్పనిసరి అంటున్నారు అధికారులు.

ఉత్తరాఖండ్ టూరిజం సెక్రటరీ దిలీప్ జవాల్కర్ మాటల్లో చెప్పాలంటే, గతంలో యాత్రికులు కేవలం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా మాత్రమే వచ్చేవారని అప్పట్లో ఈ యాత్ర కనీసం 9 రోజులు ఉండేదని, వాతావరణానికి వారు బాగా అలవాటు పడేవారని అన్నారు. ఇప్పుడు రోడ్డు, రవాణా సౌకర్యాలు బాగుండటంతో.. తక్కువ సమయంలోనే యాత్రికులు వచ్చి వెళ్లిపోతున్నారని, కొమంతమందికి వాతావరణం సరిపడక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం యాత్రికుల భద్రతే తమకు ముఖ్యం అని చెబుతోంది.

First Published:  30 May 2022 3:00 AM GMT
Next Story