Telugu Global
NEWS

కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ ఆంధ్రా యువకుడి పాదయాత్ర‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఆంధ్రా ప్రాంతంలో అనేక మంది అభిమానులున్నారు. అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళిద్దరికీ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టి అబిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడో యువకుడు ఏకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభిమాని. కేటీఆర్ పేరును త‌న చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్న శేఖర్ మంత్రి […]

ఆంధ్రా యువకుడి పాదయాత్ర‌
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఆంధ్రా ప్రాంతంలో అనేక మంది అభిమానులున్నారు. అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళిద్దరికీ కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టి అబిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడో యువకుడు ఏకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తున్నాడు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభిమాని. కేటీఆర్ పేరును త‌న చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్న శేఖర్ మంత్రి కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నాడు. అందుకోసం విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నాడు. కేసీఆర్ , కేటీఆర్ లు తెలంగాణ కోసం చేస్తున్న పనులు తననెంతో ఆకట్టుకున్నాయని శేఖర్ చెప్తున్నాడు. అభివృద్ది పథంలో పరుగులు తీస్తున్న తెలంగాణను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని శేఖర్ అంటున్నాడు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని, కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న శేఖర్ అందుకోసం పాదయాత్ర మొదలుపెట్టాడు.

కాగా ఈ దసరా నుంచి కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతారని మంత్రి మల్లా రెడ్డి ఈ మధ్య వరంగల్ లో ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రా యువకుడు శేఖర్ పాద యాత్ర మరింత ప్రాధాన్యత‌ సంతరించుకుంది. మల్లారెడ్డి చెప్పినట్టే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం కావచ్చు. అప్పుడు శేఖర్ చేసిన పాదయాత్రకు ఫలితం లభించినట్టే.

First Published:  29 May 2022 9:10 PM GMT
Next Story