Telugu Global
Cinema & Entertainment

పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన ఆది-నిక్కీ

హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ పెళ్లితో ఒకటైన సంగతి తెలిసిందే. కేవలం కొంతమంది అతిధుల సమక్షంలో వీళ్ల పెళ్లి చెన్నైలో జరిగింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ కు మాత్రం చాలామంది అతిథుల్ని ఆహ్వానించారు. అయితే ఎవరెవరు హాజరయ్యారనేది మాత్రం మీడియాకు తెలియలేదు. అలా పెళ్లి అయిన ఇన్ని రోజులకు మీడియాకు కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు ఆది-నిక్కీ. ఇందులో 2-3 పెళ్లి ఫొటోలతో పాటు రిసెప్షన్ ఫొటోలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం వారియర్ సినిమా […]

పెళ్లి ఫొటోలు రిలీజ్ చేసిన ఆది-నిక్కీ
X

హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ పెళ్లితో ఒకటైన సంగతి తెలిసిందే. కేవలం కొంతమంది అతిధుల సమక్షంలో వీళ్ల పెళ్లి చెన్నైలో జరిగింది. ఆ తర్వాత జరిగిన రిసెప్షన్ కు మాత్రం చాలామంది అతిథుల్ని ఆహ్వానించారు. అయితే ఎవరెవరు హాజరయ్యారనేది మాత్రం మీడియాకు తెలియలేదు.

అలా పెళ్లి అయిన ఇన్ని రోజులకు మీడియాకు కొన్ని ఫొటోలు రిలీజ్ చేశారు ఆది-నిక్కీ. ఇందులో 2-3 పెళ్లి ఫొటోలతో పాటు రిసెప్షన్ ఫొటోలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం వారియర్ సినిమా చేస్తున్నాడు ఆది. ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన టెక్నీషియన్స్, దర్శకుడు లింగుసామి రిసెప్షన్ కు హాజరయ్యారు.

ఇక రిసెప్షన్ లో నాని, ఆర్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్య తన భార్య సాయేషాతో కలిసి రిసెప్షన్ కు హాజరయ్యాడు. ఇటు నాని, అటు ఆర్య రిసెప్షన్ లో షో-స్టాపర్స్ గా నిలిచారు.

వీళ్లతో పాటు శుభలేఖ సుధాకర్, రాధిక, సుహాసిని, అల్లు అరవింద్, సి.కల్యాణ్, దేవిశ్రీప్రసాద్, నాజర్, ఇళయరాజా, ఐశ్వర్యరాజేశ్, జీవ, శివాజీ రాజా రిసెప్షన్ కు హాజరైన వాళ్లలో ఉన్నారు.

First Published:  29 May 2022 8:15 PM GMT
Next Story