Telugu Global
NEWS

ఐపీఎల్ ఫైనల్.. మోడీ స్టేడియంలో ప్రపంచరికార్డు

క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ముగిసిన 2022 సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ద్వారా ఈ సరికొత్త రికార్డు వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా..అత్యధికమంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్ గా టాటా ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ సమరం చరిత్ర సృష్టించింది. ఎమ్సీజీని మించిన మోడీ స్టేడియం.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న […]

ఐపీఎల్ ఫైనల్.. మోడీ స్టేడియంలో ప్రపంచరికార్డు
X

క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ముగిసిన 2022 సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ద్వారా ఈ సరికొత్త రికార్డు వెలుగులోకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా..అత్యధికమంది వీక్షించిన క్రికెట్ మ్యాచ్ గా టాటా ఐపీఎల్ 15వ సీజన్ టైటిల్ సమరం చరిత్ర సృష్టించింది.

ఎమ్సీజీని మించిన మోడీ స్టేడియం..
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరున్న మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం రికార్డును అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం అధిగమించింది. రెండేళ్ల క్రితం అహ్మదాబాద్ స్టేడియాన్ని లక్షా 32వేల సీటింగ్ కెపాసిటీతో గుజరాత్ క్రికెట్ సంఘం నిర్మించింది. అప్పటి వరకూ సర్దార్ పటేల్ స్టేడియంగా ఉన్న పేరును మార్చి.. నరేంద్ర మోడీ క్రికెట్ స్డేడియంగా నామకరణం చేసింది. 2020లో ప్రారంభమైన ఈ స్టేడియాన్ని ఐపీఎల్ క్వాలిఫైయర్ -2, ఫైనల్ మ్యాచ్ లకు వేదికగా ఎంపిక చేశారు.

లక్షా 4వేల 859 మందితో రికార్డు..
ఐపీఎల్ ఫైనల్స్ కు హార్ధిక్‌ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు చేరుకోడం, అహ్మదాబాద్ వేదికగా తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్స్ నిర్వహించడంతో.. టైటిల్ సమరం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన టైటిల్ సమరం కోసం రికార్డుస్థాయిలో లక్షా 4వేల 859 మంది హాజరయ్యారు. దీంతో ఇప్పటి వరకూ 87 వేల 812 మంది వీక్షించిన మెల్బోర్న్ స్టేడియం మ్యాచ్ రికార్డు తెరమరుగయ్యింది. 1992 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్ -పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను 87, 812 మంది స్టేడియానికి వచ్చి వీక్షించడమే ప్రపంచ రికార్డుగా నమోదయ్యింది. 1990, 2000 సీజన్ల మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సైతం లక్షమంది హాజరు కావడం సాధారణ విషయమే. అయితే ప్రస్తుత సీజన్ ఐపీఎల్ ఫైనల్స్ కు లక్షా 4వేల 859 మంది హాజరు కావడం సరికొత్త రికార్డుగా గిన్నెస్ బుక్ లో సైతం చేరనుంది.

First Published:  29 May 2022 9:27 PM GMT
Next Story