Telugu Global
NEWS

జగన్‌ చెప్పినట్టు మేం చేయాలా?

2014లో పవన్‌ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తర్వాత పవన్‌ను పలుమార్లు తీవ్రంగానే అవమానించింది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అయితే అప్పట్లో పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి, సొంత అన్న పార్టీని గెలిపించుకోలేని వ్యక్తి.. టీడీపీ గెలిపించాడమా ? అంటూ పవన్‌ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు.. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారని కూడా అప్పట్లో చింతమనేని విమర్శించారు. అందుకు పవన్‌ కూడా […]

చింతమనేని ప్రభాకర్
X

2014లో పవన్‌ కల్యాణ్ సాయంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఆ తర్వాత పవన్‌ను పలుమార్లు తీవ్రంగానే అవమానించింది. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అయితే అప్పట్లో పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.

ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి, సొంత అన్న పార్టీని గెలిపించుకోలేని వ్యక్తి.. టీడీపీ గెలిపించాడమా ? అంటూ పవన్‌ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు.. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంటారని కూడా అప్పట్లో చింతమనేని విమర్శించారు. అందుకు పవన్‌ కూడా అంతే స్థాయిలో స్పందించారు.

27 కేసులున్న చింతమనేనిని విప్‌గా ఎలా నియమించారని అప్పట్లో పవన్ ప్రశ్నించారు. తాను ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని.. 16ఏళ్ల వయసులోనే ఆకు రౌడీలను తన్ని తరిమేశా అంటూ పవన్ మాట్లాడారు.

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీడీపీ నేతల చూపు నేలబారుపట్టింది. ఒంటరిగా వెళ్తే తమ పని అంతే అన్న నిర్ధారణకు వచ్చారు. మళ్లీ జనసేనను దువ్వుతున్నారు. మహానాడు వద్ద మీడియాతో మాట్లాడిన చింతమనేని కూడా ఈసారి పవన్ విషయంలో కాస్త మెతకవైఖరితో మాట్లాడారు. జనసేనతో పొత్తు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు.. పొత్తు మాకు ఇష్టమున్నా ఆయనకు ఇష్టం ఉండాలి కదా.. ఒకవేళ ఆయనకు ఇష్టంగా ఉంటే మాకూ ఇష్టం ఉండాలి కదా అంటూ మాట్లాడారు.

జగన్‌ సింగిల్‌గా రండి అంటే మేం సింగిల్‌గా రావాలా?.. జగన్‌ డబుల్‌గా రావాలంటే మేం డబుల్‌గా రావాలా?.ఎలా రావాలన్నది మా ఇష్టం. జగన్‌ ఎవరు చెప్పడానికి అని చింతమనేని ప్రశ్నించారు. పరోక్షంగా పవన్‌ కల్యాణ్‌తో పొత్తు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చింతమనేని వ్యక్తం చేశారు.

First Published:  28 May 2022 8:40 PM GMT
Next Story