Telugu Global
National

ఆర్యన్ ఖాన్ హీరోనే.. మరి సమీర్ వాంఖడే సంగతేంటి..?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూజ్ డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నిర్దోషిగా కోర్టు తేల్చింది. మరి ఆర్యన్ కేసులో విచారణ అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న సమీర్ వాంఖడే పరిస్థితి ఏంటి..? అప్పట్లో మీడియా ఆయనను హీరోగా కీర్తించింది. రాజకీయ ఒత్తిడులున్నా కూడా ఓ స్టార్ హీరో కొడుకుని అరెస్ట్ చేశాడంటూ ఆకాశానికెత్తేసింది. కానీ ఇప్పుడు ఈ కేసులో ఆయనే టార్గెట్ అవుతున్నారు. ఆర్యన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, […]

aryan khan
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూజ్ డ్రగ్స్ కేసులో హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని నిర్దోషిగా కోర్టు తేల్చింది. మరి ఆర్యన్ కేసులో విచారణ అధికారిగా ఆరోపణలు ఎదుర్కొన్న సమీర్ వాంఖడే పరిస్థితి ఏంటి..? అప్పట్లో మీడియా ఆయనను హీరోగా కీర్తించింది. రాజకీయ ఒత్తిడులున్నా కూడా ఓ స్టార్ హీరో కొడుకుని అరెస్ట్ చేశాడంటూ ఆకాశానికెత్తేసింది. కానీ ఇప్పుడు ఈ కేసులో ఆయనే టార్గెట్ అవుతున్నారు. ఆర్యన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, ఆయన్ను విడిచి పెట్టాలంటూ తనపై ఒత్తిడి వచ్చిందని గతంలో సమీర్ వాంఖడే సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే కేసు విచారణలో ఆయన సక్రమంగా వ్యవహరించలేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కి బదిలీ చేశారు. విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారు.

2021 అక్టోబర్‌ లో కోర్డెలియా క్రూజ్ షిప్‌ పై దాడి చేసిన ఎన్సీబీ బృందానికి సమీర్ వాంఖడే నాయకత్వం వహించారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ తో పాటు మరో 20 మందిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆర్యన్ ఖాన్ ని కేసు నుంచి తప్పించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని సమీర్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయన వాటిని కొట్టిపారేశారు. తాను నిజాయితీ పరుడ్ని అని చెప్పారు. అదే సమయంలో ఆయన తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ తో ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కేవలం షారుఖ్ ఖాన్ కొడుకుని అరెస్ట్ చేయడం వల్లే సమీర్ ని కొంతమంది టార్గెట్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక్కసారిగా సమీర్ వాంఖడే హీరోగా మారిపోయారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా సమీర్ పై సంచలన ఆరోపణలు చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు సమీర్ ని బదిలీ చేశారు. దీంతో కేసు నీరుగారిపోతోందని, కావాలనే ఆయన్ను బదిలీ చేశారనే ప్రచారం కూడా జరిగింది.

చివరకు ఇప్పుడు ఆర్యన్ ఖాన్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సమీర్ వాంఖడేపై పడింది. అప్పట్లో సమీర్ అవకతవకలకు పాల్పడ్డారనే తమ ఆరోపణలు నిజమని, ఇప్పటికైనా ఈ విషయం రుజువైందని నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ అన్నారు. అయితే ఇప్పుడు వాంఖడేపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా విహరించినందుకు సమీర్ వాంఖడేపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా ఆయనపై చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

First Published:  27 May 2022 9:19 PM GMT
Next Story