Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 ని థియేటర్లలో చూసిన వెంకీ

హీరో వెంకటేష్ థియేటర్లకు రావడం చాలా తక్కువ. ఈమధ్య కాలంలో అతడి సినిమాలు థియేటర్లలోకి రాకపోవడంతో, పూర్తిగా దూరమయ్యాడు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత వెంకీ మరోసారి థియేటర్లలో ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకులతో కలిసి ఎఫ్3 సినిమా చూశాడు. “ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాల సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని […]

f3-ott-streaming
X

హీరో వెంకటేష్ థియేటర్లకు రావడం చాలా తక్కువ. ఈమధ్య కాలంలో అతడి సినిమాలు థియేటర్లలోకి రాకపోవడంతో, పూర్తిగా దూరమయ్యాడు. అలా లాంగ్ గ్యాప్ తర్వాత వెంకీ మరోసారి థియేటర్లలో ప్రత్యక్షమయ్యాడు. ప్రేక్షకులతో కలిసి ఎఫ్3 సినిమా చూశాడు.

“ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాల సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా ఉంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన సినిమా ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్ టైనర్ తీసునందుకు సంతోషంగా వుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ఎఫ్ 3 యూనిట్ అంతా వండర్ ఫుల్ టీం వర్క్ చేసింది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయాలి”

ఇలా తను థియేటర్ లో సినిమా చూసిన విషయాన్ని బయటపెట్టాడు వెంకీ. ఎఫ్3లో రేచీకటి ఉన్న వ్యక్తిగా కనిపించిన ఈ హీరో, తన పాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

First Published:  28 May 2022 7:11 AM GMT
Next Story