Telugu Global
NEWS

ఎన్టీఆర్ కు టీఆరెస్ నేతల నివాళులు, భారత రత్న ఇవ్వాలని డిమాండ్... వ్యూహమేంటి ?

నందమూరి తారకరామారావుకు తెలుగు దేశం నాయకులు, నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడం కొత్తేమీ కాదు. కానీ ఈ సారి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్నడూ లేని విధంగా టీఆరెస్ ముఖ్యనాయకులు అనేక మంది ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు.కుత్బుల్లాపూర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్క‌రణ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయాన్నే టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, ఈ […]

ఎన్టీఆర్ కు టీఆరెస్ నేతల నివాళులు, భారత రత్న ఇవ్వాలని డిమాండ్... వ్యూహమేంటి ?
X

నందమూరి తారకరామారావుకు తెలుగు దేశం నాయకులు, నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించడం కొత్తేమీ కాదు. కానీ ఈ సారి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్నడూ లేని విధంగా టీఆరెస్ ముఖ్యనాయకులు అనేక మంది ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించారు.కుత్బుల్లాపూర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్క‌రణ చేశారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయాన్నే టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, ఈ మధ్యే టీఆరెస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి రామారావుకు నివాళులు అర్పించారు. అంతేకాదు ఉషాముళ్ళ‌పూడి ఆస్పత్రి వద్ద కమ్మ సేవా సమితి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీఆరెస్ ముఖ్యనేతలంతా కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూడా మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ,మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధుసుధన్,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అక్కడితో ఆగలేదు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని టీఆరెస్ డిమాండ్ చేసింది. ఎప్పటి నుండో ఈ డిమాండ్ తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అయితే కొత్తగా టీఆరెస్ కూడా ఆ డిమాండ్ ను ఎత్తుకుంది.

కాగా ఈ రోజు నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి టీఆరెస్ లోకి వచ్చిన వాళ్ళే. అయితే గతంలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని గతంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. మరి ఈ రోజు చేసిన ఈ కార్యక్రమాల వెనక ఉన్న వ్యూహమేంటి ? ఇది సరికొత్త సమీకరణలకు దారితీయనుందా అనే చర్చమొదలయ్యింది.

First Published:  28 May 2022 4:58 AM GMT
Next Story