Telugu Global
Cinema & Entertainment

శంకర్ సినిమాలో సునీల్ పాత్ర కీలకం

కెరీర్ లో ఫస్ట్ టైమ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సునీల్. ఆ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో తనది చాలా ప్రత్యేకమైన పాత్ర అంటున్నాడు సునీల్. కెరీర్ లో ఇప్పటివరకు అలాంటి రోల్ చేయలేదని చెబుతున్నాడు. "శంకర్-రామ్ చరణ్ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. ఇప్పటివరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. నా కెరీర్ లో నేను అలాంటి కామెడీ చేయలేదు. ఇంకో కమెడియన్ చేసినట్టు కూడా నాకు […]

sunil
X

కెరీర్ లో ఫస్ట్ టైమ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సునీల్. ఆ అనుభవాన్ని మీడియాతో పంచుకున్నాడు. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో తనది చాలా ప్రత్యేకమైన పాత్ర అంటున్నాడు సునీల్. కెరీర్ లో ఇప్పటివరకు అలాంటి రోల్ చేయలేదని చెబుతున్నాడు.

"శంకర్-రామ్ చరణ్ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. ఇప్పటివరకు నేను అలాంటి పాత్ర చేయలేదు. నా కెరీర్ లో
నేను అలాంటి కామెడీ చేయలేదు. ఇంకో కమెడియన్ చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. అలాంటి పాత్ర అది. చాలా
స్పెషల్ పాత్ర. సినిమా మొత్తం నా పాత్ర ఉంటుంది. చాలా ఇంపాక్ట్ ఉంటుంది."

సినిమాలో తనకు ఆ పాత్ర దక్కడం వెనక శంకర్, దిల్ రాజు ప్రోత్సాహం ఉందన్నాడు సునీల్. వాళ్లు తనపై నమ్మకం పెట్టుకున్నారు కాబట్టే అలాంటి మంచి పాత్ర దక్కిందని, లేకపోతే మరో నటుడికి ఆ పాత్ర వెళ్లిపోయి ఉండేదని అభిప్రాయపడ్డాడు.

"ఈ పాత్ర నాకు ఇవ్వడం వెనక శంకర్ ప్రోత్సాహం చాలా ఉంది. ఈ రోల్ కోసం చర్చ జరిగినప్పుడు నన్ను తీసుకోవడంపై కొందరు అభ్యంతరం తెలిపారు. కామెడీ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు వేరే రకమైన పాత్రలు చేస్తున్నారని చెప్పారట. సైక్లింగ్-స్విమ్మింగ్ ఒకసారి వస్తే ఎవ్వరూ మరిచిపోరు. సునీల్ కామెడీ కూడా అలాంటిదే అని శంకర్ అన్నారట. అంతకంటే నాకు ఇంకేం కావాలి."

లాంగ్ గ్యాప్ తర్వాత ఎఫ్3తో మరోసారి నవ్వించాడు సునీల్. ఆ సినిమా సక్సెస్ ను తను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నానని, ఇకపై మరిన్ని కామెడీ పాత్రలు పోషిస్తానని అంటున్నాడు.

First Published:  28 May 2022 12:28 AM GMT
Next Story