Telugu Global
NEWS

హంతకులే జయంతి చేస్తున్నారు- మంత్రి రోజా

హంతకులే జయంతి కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ మహానాడును ఉద్దేశించి మంత్రి రోజా విమర్శించారు. ఎన్టీఆర్‌ గురించి చెప్పాల్సిన మహానాడులో… పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు, మగవాళ్లు అంతా జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, మహానాడును బూతునాడుగా మార్చారని రోజా విమర్శించారు. వైసీపీని అంబోతు అచ్చెన్నాయుడు గాలి పార్టీ అని విమర్శిస్తున్నారని.. ఇదే ఫ్యాన్‌ గాలి దెబ్బకు లోకేష్‌బాబు, చంద్రబాబు ఇద్దరూ పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత పార్టీ లేదు, ఏమీ […]

హంతకులే జయంతి చేస్తున్నారు- మంత్రి రోజా
X

హంతకులే జయంతి కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ మహానాడును ఉద్దేశించి మంత్రి రోజా విమర్శించారు. ఎన్టీఆర్‌ గురించి చెప్పాల్సిన మహానాడులో… పిల్లలు, పెద్దలు, ఆడవాళ్లు, మగవాళ్లు అంతా జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు, మహానాడును బూతునాడుగా మార్చారని రోజా విమర్శించారు.

వైసీపీని అంబోతు అచ్చెన్నాయుడు గాలి పార్టీ అని విమర్శిస్తున్నారని.. ఇదే ఫ్యాన్‌ గాలి దెబ్బకు లోకేష్‌బాబు, చంద్రబాబు ఇద్దరూ పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత పార్టీ లేదు, ఏమీ లేదని స్వయంగా చెప్పిన విషయాన్ని అచ్చెన్నాయుడు మరిచిపోతున్నారని రోజా విమర్శించారు.

30 నియోజవర్గాల్లో తమకు అభ్యర్థులు లేరని నారా లోకేషే స్వయంగా చెప్పారని… అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుకోలేని పార్టీ జగన్‌ను ఎలా ఓడిస్తుందని రోజా ప్రశ్నించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని టెంట్లు వేసి ఆందోళన చేసిన వారే ఇప్పుడు అక్కడ విధ్వంసం సృష్టించి తిరిగి సిగ్గు లేకుండా వైసీపీ వారే మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టుకున్నారని ప్రచారం చేస్తున్నారని రోజా విమర్శించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ మాటలు వింటుంటే ఇక వారిని ప్రజలు రాళ్లతో కొట్టడమే మిగిలిందన్నారు.

అందరూ మనస్శాంతితో ఉంటే చంద్రబాబు మనస్శాంతి ఉండదని రోజా విమర్శించారు. తన కో- అరిస్ట్‌ బాలకృష్ణను చూస్తుంటే బాధేస్తోందన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా బాలకృష్ణ ఉండిఉంటే జగన్‌ తరహాలోనే ఎన్టీఆర్ వారసుడిగా ముఖ్యమంత్రి అయి ఉండేవారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గుర్తుకు రాని తండ్రి సొంతూరు నిమ్మకూరు ఇప్పుడు బాలకృష్ణకు గుర్తుకొచ్చిందన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ పెద్ద విగ్రహం పెడుతా అంటున్న బాలకృష్ణకు గడిచిన ఐదేళ్లలో కూడా ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిన జగన్‌మోహన్ రెడ్డికి మహానాడులో కనీసం కృతజ్ఞతలు చెబుతూ తీర్మానం కూడా చేయలేకపోయారని.. దీన్ని బట్టే ఇప్పుడున్నది ఎన్టీఆర్ టీడీపీ కాదు, నారా వారి టీడీపీ అని అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేసి, ఎన్టీఆర్‌ కుమారుడిగా బాలకృష్ణ పనిచేయాలన్నారు రోజా.

First Published:  28 May 2022 1:50 AM GMT
Next Story