Telugu Global
NEWS

మాటల మరాఠా...చేతల బరాటా! 60వ పడిలో రవి శాస్త్రి

భారత క్రికెట్ అత్యంత విజయవంతమైన కోచ్, మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ రవి శాస్త్రి 60వ పడిలో ప్రవేశించాడు. తన మాటలు, చేతలతో అత్యుత్తమ ఫలితాలు సాధంచడం ద్వారా భారత క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న రవిశాస్త్రి 60వ పుట్టినరోజున క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. 1980 దశకంలో భారత క్రికెట్ కు స్పిన్ ఆల్ రౌండర్ గా అసమాన సేవలు అందించిన రవిశాస్త్రిని క్రికెట్ దేవుడు సచిన్ […]

రవి శాస్త్రి
X

భారత క్రికెట్ అత్యంత విజయవంతమైన కోచ్, మాజీ కెప్టెన్, విఖ్యాత కామెంటీటర్ రవి శాస్త్రి 60వ పడిలో ప్రవేశించాడు. తన మాటలు, చేతలతో అత్యుత్తమ ఫలితాలు సాధంచడం ద్వారా భారత క్రికెట్ చరిత్రలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న రవిశాస్త్రి 60వ పుట్టినరోజున క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.

1980 దశకంలో భారత క్రికెట్ కు స్పిన్ ఆల్ రౌండర్ గా అసమాన సేవలు అందించిన రవిశాస్త్రిని క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ తనదైన సందేశంతో అభినందించాడు.

క్రికెట్టే ఊపిరిగా, శ్వాసగా భావించే రవిశాస్త్రి తనకు ఆప్తుడు, సహాధ్యాయి…అరమరికలు లేకుండా క్రికెట్ ముచ్చట్లు చెప్పే స్నేహితుడు అంటూ మాస్టర్ తన సందేశంలో కొనియాడాడు.

వ్యక్తిగత వైద్యుని ఆదేశాలు పాటిస్తూ రవి శాస్త్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలంటూ సచిన్ ఓ చిలిపి సందేశాని పంపాడు. దానికి ప్రతిగా రవిశాస్త్రి సైతం ఓ కొంటే సమాధానమిచ్చాడు.

థ్యాంక్యూ బిగ్ బాస్..శుభాకాంక్షలు చెబుతూ నీవు పంపిన సందేశం అమూల్యం, స్నేహితులతో కలసి పుట్టినరోజు పండుగ చేసుకోమని డాక్టర్ సలహా ఇచ్చారంటూ..

రవిశాస్త్రి ప్రత్యుత్తర మిచ్చాడు.
రవి భాయ్ కి హ్యాట్సాఫ్…

రవిశాస్త్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్ పూజారా లాంటి ప్రముఖ క్రికెటర్లు ఎందరో ఉన్నారు

1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారతజట్టులో సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి 1985 చాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోడం ద్వారా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు.

తన కెరియర్ లో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి 6, 500 పరుగులు సాధించాడు. లెఫ్టామ్ స్పిన్ బౌలర్ గా 280 వికెట్లు పడగొట్టిన రికార్డు సైతం ఉంది.

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ కామెంటీటర్ గా స్థిరపడిన రవిశాస్త్రి గొప్ప వాఖ్యాతగా పేరు తెచుకొన్నాడు.
భారతజట్టు ప్రధాన శిక్షకుడిగా…

ముంబై స్కూల్ ఆఫ్ క్రికెట్ నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన రవిశాస్త్రి…అంతర్జాతీయ క్రికెటర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నాడు. రిటైర్మెంట్ తర్వాత..ప్రపంచమేటి క్రికెట్ వ్యాఖ్యాతలలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాత భారత సీనియర్ జట్టు శిక్షకుడిగా…అనీల్ కుంబ్లే నుంచి పగ్గాలు చేతపట్టిన తర్వాత నుంచి రవిశాస్త్రి వెనుదిరిగి చూసింది లేదు.

ఆధునిక భారత క్రికెట్లో..గ్రెగ్ చాపెల్, జాన్ రైట్, డంకన్ ఫ్లెచర్,గ్యారీ కిర్‌ స్టెన్, అనీల్ కుంబ్లే లాంటి విదేశీ, స్వదేశీ కోచ్ లు జాతీయజట్టుకు ప్రధానశిక్షకులుగా వ్యవహరించినా…రవి శాస్త్రి మాత్రమే అత్యంత విజయవంతమైన గురువుగా నిలిచాడు.

2017- 2021

రవిశాస్త్రి… 2017లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా పగ్గాలు చేపట్టాడు. రవి నేతృత్వంలో భారతజట్టు చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించింది. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో 46 టెస్టులు ఆడిన భారత జట్టు 28 గెలవగా.. ఐదింటిని డ్రా చేసుకుంది. ఇక మొత్తం 91 వన్డేలు ఆడి…57 విజయాలతో 62.64 సక్సెస్ రేటును నమోదు చేసింది.

పొట్టి ఫార్మాట్‌ విషయానికొస్తే… అరవై ఐదింట.. 43 విజయాలు. మొత్తంగా 184 మ్యాచ్‌లలో 119 గెలుపొందింది. విజయాల శాతమే ఎక్కువగా ఉన్నా… ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది.

ముఖ్యంగా 2019లో వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి టీమిండియా కనీసం ఫైనల్‌కు కూడా చేరకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది. అంతేగాక జట్టు సెలక్షన్‌ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడును కాదని.. విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ ముగిసిన తర్వాత హెడ్‌కోచ్‌ పదవి నుంచి

రవిశాస్త్రి వైదొలిగాడు.

ఏడాదికి 7 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై భారతజట్టుకు చీఫ్ కోచ్ గా సేవలు అందించిన రవిశాస్త్రి… ఒక్క ప్రపంచకప్ టైటిలూ అందించలేకపోడం తీరని లోటుగా మిగిలిపోతుంది.
అరుదైన విజయాలు, రికార్డులు…

రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా, విరాట్ కొహ్లీ నాయకత్వంలో భారతజట్టు…రెండుసార్లు కంగారూగడ్డపై ఆస్ట్ర్రేలియాను ఓడించడం ద్వారా సిరీస్ విజేతగా నిలిచింది. స్వదేశీ, విదేశీగడ్డపై జరిగిన సిరీస్ ల్లో తొలిటెస్టు ఓడినా…ఆ తర్వాత పుంజుకొని ఆడి విజేతగా నిలవడం ఓ అలవాటుగా మార్చుకోగలిగింది. యువఆటగాళ్లలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, తగిన అవకాశాలు కల్పించడం, అత్యుత్తమంగా రాణించేలా చేయడంలో రవిశాస్త్రి పాత్ర అంతాఇంతా కాదు.

First Published:  28 May 2022 1:11 AM GMT
Next Story