Telugu Global
Andhra Pradesh

జిల్లాల విభజనను సమీక్షిస్తాం.. రాజకీయ విభజనలు సరిచేస్తాం..

ఒంగోలులో టీడీపీ మహానాడు రెండోరోజు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం.. నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండోరోజు మహానాడుని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. మహానాడుకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకోవాలని చూశారని, వాహనాల్లో గాలి తీసేశారని, ప్రజలు జగన్ ప్రభుత్వానికి గాలి తీసే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల విభజనపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాజకీయ […]

జిల్లాల విభజనను సమీక్షిస్తాం.. రాజకీయ విభజనలు సరిచేస్తాం..
X

ఒంగోలులో టీడీపీ మహానాడు రెండోరోజు చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ సుదీర్ఘ ఉపన్యాసాలిచ్చారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం.. నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండోరోజు మహానాడుని ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. మహానాడుకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకోవాలని చూశారని, వాహనాల్లో గాలి తీసేశారని, ప్రజలు జగన్ ప్రభుత్వానికి గాలి తీసే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల విభజనపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాజకీయ విభజనలు సరిచేస్తామన్నారు. మహానాడుకి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి జగన్ కి నిద్రపట్టదని ఎద్దేవా చేశారు చంద్రబాబు. గడప గడపకు వెళ్తున్న మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారని, వాళ్ల మీటింగ్‌ లు వెల వెల.. మన మీటింగ్‌ కళ కళ అని టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

వైసీపీ ప్రభుత్వం 8లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకుందని మండిపడ్డారు చంద్రబాబు. ఈ ఏడాదంతా ఎన్టీఆర్ సంక్షేమ పాలనను ప్రజలకు గుర్తు చేసేటట్టు.. జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు పెడతామన్నారు. బాలకృష్ణ అఖండ సినిమాని అడ్డుకోవాలని చూశారని, తాము అధికారంలోకి వస్తే.. వైసీపీకి చెందిన పేపర్, టీవీ, సిమెంట్ ఫ్యాక్టరీలు ఎలా నడుస్తాయో చూస్తానని అన్నారు చంద్రబాబు.

దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టోయ్.. అనే రీతిలో వైసీపీ పాలన కొనసాగుతోందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు బాలకృష్ణ. వైసీపీ మూడేళ్ల పాలనలో ధరలు పెరిగాయని.. అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని ఎన్టీఆర్ తపించేవారని, సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఆయనేనని చెప్పారు బాలకృష్ణ. టీడీపీని అధికారంలోకి తెస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు బాలయ్య.

యువజన శృంగార రౌడీ కాంగ్రెస్..
వైఎస్సార్సీపీకి యువజన శృంగార రౌడీ కాంగ్రెస్.. అంటూ కొత్త నిర్వచనం చెప్పారు నారా లోకేష్. టీడీపీ పునాదులు గట్టిగా ఉన్నాయని, ఎవరూ ఏం చేయలేరని అన్నారాయన. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం నంబర్‌ వన్‌ గా ఉందన్నారు. చెత్త పన్ను, ఇసుక ధరల్లో ఏపీ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపు లేదని.. కేవలం మందు చూపు మాత్రమే ఉందని విమర్శించారు. టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మళ్లీ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం గాడిలో పడుతుందని అన్నారు.

First Published:  28 May 2022 11:55 AM GMT
Next Story