Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ నుంచి మరో మాస్ లుక్ పోస్టర్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకొని, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ.. ఈ సినిమా నుంచి మరో మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేవాలయం బ్యాక్ డ్రాప్ లో చేతిలో రక్తం చిందిన కట్టి పట్టుకొని, పిడికిలి బిగిస్తూ బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ […]

Balakrishna
X

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకొని, ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ.. ఈ సినిమా నుంచి మరో మాస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

దేవాలయం బ్యాక్ డ్రాప్ లో చేతిలో రక్తం చిందిన కట్టి పట్టుకొని, పిడికిలి బిగిస్తూ బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. తన ఆల్-టైమ్ ఫేవరెట్ స్టార్ బాలకృష్ణతో సినిమా చేయడం గోపీచంద్ మలినేని కల. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని కల నిజమైయింది. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్ లుక్, డిఫరెంట్ పాత్రలో బాలకృష్ణని చూపించబోతున్నారు గోపిచంద్. సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటిస్తారు.

ఇప్పటికే 40 శాతం షూట్ పూర్తయింది. ఇప్పటివ‌ర‌కు వ‌చ్చిన అవుట్ పుట్ తో టీమ్ చాలా సంతృప్తిగా వుంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Next Story