Telugu Global
National

మార్కెట్ నుంచి నిమ్మకాయలు, టమాటాలు చోరీ చేసిన దొంగలు

దేశంలో నిమ్మకాయలు, టమాటాల రేట్లు ఆకాశానంటుతున్నాయి. వాటిని కొనాలంటేనే వినియోగధారులు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం టమాటాలు, నిమ్మకాయలు బంగారమయ్యాయి. అందుకే దొంగలు వాటిని దొంగతనం చేశారు. గురుగ్రామ్ లోని ఖంద్సా హోల్‌సేల్‌ మార్కెట్ కు ఛర్ఖి దాద్రి గ్రామానికి చెందిన సందీప్ సింగ్ అనే డ్రైవర్‌ గురువారం రాత్రి పది బస్తాల నిమ్మకాయలు, 35 క్రేట్ల టమాటాలు, 15 సంచుల క్యాప్సికం తీసుకొచ్చాడు. రాత్రి షాపులో పెట్టి వెళ్ళి పోయాడు. ఉదయం వచ్చి చూడగా షెటర్ […]

మార్కెట్ నుంచి నిమ్మకాయలు, టమాటాలు చోరీ చేసిన దొంగలు
X

దేశంలో నిమ్మకాయలు, టమాటాల రేట్లు ఆకాశానంటుతున్నాయి. వాటిని కొనాలంటేనే వినియోగధారులు భయపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం టమాటాలు, నిమ్మకాయలు బంగారమయ్యాయి. అందుకే దొంగలు వాటిని దొంగతనం చేశారు.

గురుగ్రామ్ లోని ఖంద్సా హోల్‌సేల్‌ మార్కెట్ కు ఛర్ఖి దాద్రి గ్రామానికి చెందిన సందీప్ సింగ్ అనే డ్రైవర్‌ గురువారం రాత్రి పది బస్తాల నిమ్మకాయలు, 35 క్రేట్ల టమాటాలు, 15 సంచుల క్యాప్సికం తీసుకొచ్చాడు. రాత్రి షాపులో పెట్టి వెళ్ళి పోయాడు. ఉదయం వచ్చి చూడగా షెటర్ విరగ్గొట్టి ఉంది. లోపల టమాటాలు, నిమ్మకాయలు, క్యాప్సికం బ్యాగులు కనిపించలేదు. అది చూసిన సందీప్ బోరు బోరున ఏడుస్తూ పోలీసు స్టేషన్ కు పరుగులు తీశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగల కోసం గాలిస్తున్నారు.

దొంగతనానికి గురైన ఆ నిమ్మకాయలు, టమాటాలు, క్యాప్సికం విలువ రిటైల్ మార్కెట్ లో లక్షా 50 వేల దాకా ఉంటుందని సందీప్ చెప్పాడు.

మార్కెట్ లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వీడియోను పరిశీలించారు. “నలుగురు నిందితులు కారులో వచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఒకరు కారులో కూర్చుని ఉండగా, అతని ముగ్గురు సహచరులు షెడ్‌లోని కూరగాయలను కారులోకి ఎక్కించుకుని పారిపోయారు.” అని పోలీసు అధికారి తెలిపారు.

గత కొద్ది రోజులుగా టమాటా ధర దాదాపు రెట్టింపు అయ్యిందని, పదిహేను రోజుల క్రితం 600 రూపాయల‌కు విక్రయించే టమాటా బస్తా (24 కిలోలు) ప్రస్తుతం 1200 రూపాయలు పలుకుతుందని హోల్‌సేల్ ఖండ్సా మండిలో కూరగాయల వ్యాపారులు తెలిపారు.

First Published:  28 May 2022 5:40 AM GMT
Next Story