Telugu Global
NEWS

'దసరా నుంచి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్'

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారన్న ప్రశ్న చాలా మందిలో తొలుస్తోంది. ఈ మధ్య ఆయన దేశవ్యాప్త పర్యటన చేస్తూ పలువురు ఇతర పార్టీల నాయకులతో సమావేశమవుతుండడంతో మరింత ఉత్కంట పెరిగింది. అయితే కేసీఆర్ రాజకీయాల్లోకి ఎప్పటి నుండి అడుగుపెడతారనే విషయంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక సదస్సుకు హాజరైన మంత్రి […]

దసరా నుంచి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆరెస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగుపెడతారన్న ప్రశ్న చాలా మందిలో తొలుస్తోంది. ఈ మధ్య ఆయన దేశవ్యాప్త పర్యటన చేస్తూ పలువురు ఇతర పార్టీల నాయకులతో సమావేశమవుతుండడంతో మరింత ఉత్కంట పెరిగింది. అయితే కేసీఆర్ రాజకీయాల్లోకి ఎప్పటి నుండి అడుగుపెడతారనే విషయంపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు.

హనుమకొండ జిల్లా కాజీపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక సదస్సుకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా రోజున కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతారని ప్రకటించారు. ఆ రోజు వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతారని ఇక అప్పటి నుంచి ఆయన వెనకకు తిరిగి చూసే ప్రసక్తే లేదని అన్నారు మల్లారెడ్డి.

మంత్రి మల్లారెడ్డి మాటలే నిజమైతే కొద్ది రోజుల్లోనే కేసీఆర్ ను జాతీయ నేతగా చూడబోతాము. అయితే ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారా లేక కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారా అనే చర్చ అప్పుడే మొదలయ్యింది.

First Published:  28 May 2022 12:20 AM GMT
Next Story