Telugu Global
Cinema & Entertainment

త్వరలో పీవీ నర్సింహారావు పై బయోపిక్

అపర చాణుక్యుడు, బహుభాషా కోవిదుడు , మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన మనవరాలు అజిత ఈ బయోపిక్ తీయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. తన తాతగారి బయోపిక్ కోసం ప్రస్తుతం టి.ఆర్.ఎస్.పార్టీ తరపున‌ “ఎమ్.ఎల్.సి”గా ఉన్న తన తల్లి వాణీదేవి సలహాలు సూచనలు తీసుకుంటున్నానని అజిత తెలిపారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు… బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో […]

త్వరలో పీవీ నర్సింహారావు పై బయోపిక్
X

అపర చాణుక్యుడు, బహుభాషా కోవిదుడు , మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బయోపిక్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన మనవరాలు అజిత ఈ బయోపిక్ తీయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

తన తాతగారి బయోపిక్ కోసం ప్రస్తుతం టి.ఆర్.ఎస్.పార్టీ తరపున‌ “ఎమ్.ఎల్.సి”గా ఉన్న తన తల్లి వాణీదేవి సలహాలు సూచనలు తీసుకుంటున్నానని అజిత తెలిపారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు… బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అజిత వివరించారు.

అజిత ప్రస్తుతం ఫార్మసీ,ఆర్కిటెక్చర్,ఫైన్ ఆర్ట్స్,ఫోటోగ్రఫీలలో డిప్లొమా మొదలుకుని… పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ వరకు విద్యనందిస్తున్న ప్రతిష్టాత్మక కళాశాలలను నిర్వహిస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల‌ కోసం కళాశాల ప్రాంగణంలోనే అత్యంత ఆధునాతనంగా.. గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను నెలకొల్పిన అజిత… చిన్న, మధ్య తరగతి నిర్మాతలకు లాభాపేక్ష లేకుండా వాటిని అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాదు మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించిన సువిశాల భవంతుల్లో పలు రకాల సన్నివేశాలు షూటింగ్స్ చేసుకునే వీలు కూడా ఉందన్నారు.

త్వరలోనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కూడా ప్రారంభించాలని సంకల్పించారు అజిత ”మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్, ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము” అని తెలిపారు అజిత‌

First Published:  28 May 2022 6:03 AM GMT
Next Story