Telugu Global
Cinema & Entertainment

నందమూరి వంశం నుంచి మరో బ్యానర్

నందమూరి కాంపౌండ్ లో ఇప్పటికే కొన్ని బ్యానర్లు ఉన్నాయి. వీటిలో కల్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ యాక్టివ్ గా ఉంది. వీటికి తోడు ఇప్పుడు మరో బ్యానర్ వచ్చి చేరింది. ఈ బ్యానర్ పేరు బసవతారకరామ క్రియేషన్స్. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నందమూరి బాలకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ని లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో […]

నందమూరి వంశం నుంచి మరో బ్యానర్
X

నందమూరి కాంపౌండ్ లో ఇప్పటికే కొన్ని బ్యానర్లు ఉన్నాయి. వీటిలో కల్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ యాక్టివ్ గా ఉంది. వీటికి తోడు ఇప్పుడు మరో బ్యానర్ వచ్చి చేరింది. ఈ బ్యానర్ పేరు బసవతారకరామ క్రియేషన్స్.

నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నందమూరి బాలకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ ని లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్’ బ్యానర్ లో తొలి చిత్రంగా.. నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు.

ఇలా నందమూరి వంశం నుంచి మరో నటవారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, కాస్త డిఫరెంట్ గా ఉండే మూవీస్ చేస్తున్నాడు చైతన్య కృష్ణ. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తారు.

First Published:  28 May 2022 7:51 AM GMT
Next Story