Telugu Global
Cinema & Entertainment

క్రిటిక్స్ పై ఫైర్ అయిన అనీల్ రావిపూడి

సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వస్తే లోపం ఎక్కడుందా అని ఆలోచించేవారు దర్శకులు. కానీ ఇప్పటి దర్శకుల్లో అది కొరవడింది. నెగెటివ్ కామెంట్స్ వచ్చిన వెంటనే సమీక్షకులపై విరుచుకుపడిపోవడం మొదలైంది. ఇప్పటికే పలువురు దర్శకులు.. సమీక్షకులపై విమర్శలు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి అనీల్ రావిపూడి కూడా చేరిపోయాడు. ఎఫ్3 సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు సినిమా బాగుందన్నారు, మరికొందరు ఫార్స్ కామెడీ ఉందన్నారు. ఇంకొందరు అంచనాలు అందుకోలేకపోయిందన్నారు. వీటన్నింటిపై అనీల్ రావిపూడి భగ్గుమన్నాడు. “ఒరేయ్ […]

Anil Ravipudi
X

సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వస్తే లోపం ఎక్కడుందా అని ఆలోచించేవారు దర్శకులు. కానీ ఇప్పటి దర్శకుల్లో అది కొరవడింది. నెగెటివ్ కామెంట్స్ వచ్చిన వెంటనే సమీక్షకులపై విరుచుకుపడిపోవడం మొదలైంది. ఇప్పటికే పలువురు దర్శకులు.. సమీక్షకులపై విమర్శలు చేశారు. ఇప్పుడీ లిస్ట్ లోకి అనీల్ రావిపూడి కూడా చేరిపోయాడు.

ఎఫ్3 సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు సినిమా బాగుందన్నారు, మరికొందరు ఫార్స్ కామెడీ ఉందన్నారు. ఇంకొందరు అంచనాలు అందుకోలేకపోయిందన్నారు. వీటన్నింటిపై అనీల్ రావిపూడి భగ్గుమన్నాడు.

“ఒరేయ్ బాబూ.. నవ్వుకునే సినిమా వచ్చింది. ప్రశాంతంగా నవ్వుకుందాం. పాజిటివ్ గా ఉందాం. శుక్రవారం వస్తే చాలు నెగెటివిటీ ఎక్కువైపోయింది. ఈ సినిమాకు అది తక్కువ, ఇది తక్కువ లాంటి లెక్కలు అవసరం లేదు. హ్యాపీగా సినిమా చూసి నవ్వుకోండి.”

సంవత్సరానికి నవ్వుకునే సినిమాలు ఒకట్రెండు మాత్రమే వస్తాయని, వాటిల్లో కూడా లెక్కలేసుకుంటే ఇక మనం ఎంజాయ్ చేయలేమని రివ్యూవర్లకు సూచించాడు రావిపూడి.

First Published:  28 May 2022 12:29 AM GMT
Next Story