Telugu Global
NEWS

అనుభవిస్తున్నారు. ఇకనైనా మనుషుల్లా బతకండి

తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నటుడు బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. మధ్యమధ్యలో సబ్జెక్ట్ జంప్‌ అవుతున్నప్పటికీ.. సినిమా డైలాగులు చెబుతూ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక్క చాన్స్ అని ఇచ్చారు అనుభవిస్తున్నారు అంటూ ఏపీ ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇక అనుభవించవద్దు.. ఆత్మ విమర్శ చేసుకోండి అని సూచించారు. ఇకనైనా మనుషుల్లా బతకాలన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి అన్న పరిస్థితి ఏపీలో తలకిందులై […]

actor-balakrishna-speech-at-ntr-centenary-celebrations-in-tenali
X

తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో నటుడు బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. మధ్యమధ్యలో సబ్జెక్ట్ జంప్‌ అవుతున్నప్పటికీ.. సినిమా డైలాగులు చెబుతూ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఒక్క చాన్స్ అని ఇచ్చారు అనుభవిస్తున్నారు అంటూ ఏపీ ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇక అనుభవించవద్దు.. ఆత్మ విమర్శ చేసుకోండి అని సూచించారు. ఇకనైనా మనుషుల్లా బతకాలన్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి అన్న పరిస్థితి ఏపీలో తలకిందులై దేశమంటే మనుషులు కాదు.. మట్టే అన్నట్టుగా తయారైందన్నారు.

”ఓటుతోనే ఉంది నేటి రాజకీయం ముడిపడి.. ఓటును వృథా చేయకు త్వరపడి.. ఓటును సవ్యంగా వేస్తేనే నీకు ఉంటుంది గుడి,బడి ” అంటూ డైలాగ్ చెప్పారు. ఇప్పుడున్నప్రభుత్వం మాత్రం గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేలా ఉందన్నారు. అధికారం కోసం కులాలను ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నామని.. కాబట్టి ప్రజలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

తన సినిమాలు పార్టీలకు, కులాలకు, ప్రాంతాలకు, వైషమ్యాలకు అతీతంగా ఉంటాయన్నారు. ” ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలను, వంచనకు ఎదురుతిరిగే మాదిగను, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కల్మషం లేని యాదవుడిని, జ్ఞానంలో బ్రహ్మణుడిని, ఆపదలో ఆదుకునే వెలమను, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మను, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని” అంటూ డైలాగ్ చెప్పారు. మధ్యమధ్యలో సంస్కృత శ్లోకాలూ వదిలారు బాలకృష్ణ.

దానవీరశూరకర్ణ సినిమాలో ”ఏమంటివి.. ఏమంటివి ” అన్న డైలాగ్‌ను బట్టి .. విలువ మనిషికే గానీ.. పుట్టిన కులానికి కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. యువత భవిష్యత్తు కోసమే తమలాంటి వారి తపన అని వ్యాఖ్యానించారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు లాంటి వారు ఈ దేశంలో మరే పార్టీకి లేరన్నారు.

First Published:  28 May 2022 3:54 AM GMT
Next Story