Telugu Global
Cinema & Entertainment

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ అప్ డేట్స్

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాడు వంశీ పైడిపల్లి. 25 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొన్నారు. విజయ్ కెరీర్ లో ఇది 66వ చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ప్రభు, […]

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ అప్ డేట్స్
X

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాడు వంశీ పైడిపల్లి. 25 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ తో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొన్నారు.

విజయ్ కెరీర్ లో ఇది 66వ చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లలో చాలామంది ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు.

ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు. సంగీత దర్శకుడిగా తమన్, కెమెరామేన్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కేఎల్ ప్రవీణ్ ను తీసుకున్నారు. 2023 సంక్రాంతి ఎట్రాక్షన్ గా ఈ సినిమాను తీసుకురావాలని అనుకుంటున్నారు.

రీసెంట్ గా వచ్చిన బీస్ట్ సినిమాతో విమర్శలు ఎదుర్కొన్నాడు హీరో విజయ్. కంటెంట్ పై సరిగ్గా దృష్టి పెట్టడం లేదంటూ అతడిపై కామెంట్స్ వినిపించాయి. దీంతో ప్రస్తుతం ఈ హీరో ఒత్తిడిలో ఉన్నాడు. వంశీ పైడిపల్లి సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. లేదంటే అతడిపై మరిన్ని విమర్శలు చెలరేగడం ఖాయం.

First Published:  27 May 2022 4:41 AM GMT
Next Story