Telugu Global
NEWS

రోడ్డుపక్కన కేటీఆర్ లంచ్.. వైరల్ అవుతున్న ఫొటోలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ రోడ్డు పక్కన కూర్చొని లంచ్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఆయన స్ట్రీట్ సైడ్ ఫుడ్ తిన్నది తెలంగాణలో కాదు. అసలు ఆ మాటకొస్తే ఇండియాలోనేకాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజుల పాటు పాల్గొని తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో చివరి రోజు జ్యూరిచ్‌లో […]

రోడ్డుపక్కన కేటీఆర్ లంచ్.. వైరల్ అవుతున్న ఫొటోలు
X

తెలంగాణ మంత్రి కేటీఆర్ రోడ్డు పక్కన కూర్చొని లంచ్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ఆయన స్ట్రీట్ సైడ్ ఫుడ్ తిన్నది తెలంగాణలో కాదు. అసలు ఆ మాటకొస్తే ఇండియాలోనేకాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు కోసం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మూడు రోజుల పాటు పాల్గొని తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో చివరి రోజు జ్యూరిచ్‌లో ఆయన రోడ్డు పక్కన లంచ్ చేశారు.

జ్యూరిచ్‌లోని స్ట్రీట్ ఫుడ్ తిన్న తర్వాత దిగిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. లైట్ బ్లూ కలర్ షర్ట్, నేవీ బ్లూ కలర్ సూట్‌లో అదిరిపోయే లుక్కులో ఉన్న కేటీఆర్ ఫొటోలను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.

‘జ్యూరిచ్‌లోని ఒక స్ట్రీట్ సైడ్ సీటింగ్‌లో లంచ్ చేశాను. పర్ఫెక్ట్ వెదర్ ఉన్నది. అదియోస్ దావోస్ (అంటే గుడ్ బై అని అర్థం).. మళ్లీ వచ్చే వరకు’ అంటూ ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.

First Published:  27 May 2022 10:14 AM GMT
Next Story