Telugu Global
National

మహిళల పట్ల పోలీసుల క్రూరత్వం " నలుగురు కుటుంబ సభ్యుల‌ ఆత్మహత్య‌

ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రవర్తన వల్ల ఓ కుటుంబంలోని నలుగురు స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు. బాగ్‌పత్ జిల్లాలోని బచోడ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే…. బచోడ్ గ్రామంలో OBC కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఓ దళిత అమ్మాయి ప్రేమించుకొని ఊరు విడిచి వెళ్ళిపోయారు. దీనిపై యువతి తండ్రి కాంతిలాల్ , తన కూతురును ఆ యువకుడు, అతని కుటుంబం కిడ్నాప్ చేసిందని పోలీసులకు పిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆ యువకుడి ఇంటిపై దాడి […]

మహిళల పట్ల పోలీసుల క్రూరత్వం  నలుగురు కుటుంబ సభ్యుల‌ ఆత్మహత్య‌
X

ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రవర్తన వల్ల ఓ కుటుంబంలోని నలుగురు స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు.
బాగ్‌పత్ జిల్లాలోని బచోడ్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే….

బచోడ్ గ్రామంలో OBC కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఓ దళిత అమ్మాయి ప్రేమించుకొని ఊరు విడిచి వెళ్ళిపోయారు. దీనిపై యువతి తండ్రి కాంతిలాల్ , తన కూతురును ఆ యువకుడు, అతని కుటుంబం కిడ్నాప్ చేసిందని పోలీసులకు పిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆ యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఆ యువకుడి తల్లి, ఆమె ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. మహిళా పోలీసులు లేకుండానే మగ పోలీసులు ఇంట్లోకి వెళ్ళారు. ఆ నలుగురి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని యువకుడి తండ్రి మెహక్ సింగ్ ఆరోపించారు. పోలీసులు వెళ్ళిపోగానే ఆ నలుగురు మహిళలు విషం తీసుకొని చనిపోయారు. “పోలీసు క్రూరత్వం కారణంగా నా కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది… పోలీసులు నా భార్య, కుమార్తెలను దుర్భాషలాడారు. వారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ అవమానం వారిని ఆత్మహత్యకు పురికొల్పింది ” అని సింగ్ మీడియాతో అన్నారు. ఆ సమయంలో ఇంట్లో కేవలం మహిళలు మాత్రమే ఉన్నప్పటికీ, ఈ దాడిలో మహిళా పోలీసులు మాత్రం లేరని ఆయన ఆరోపించారు.

పోలీసులతో పాటు ఆ ఇంటికి వచ్చిన వారిలో సింగ్‌పై ఫిర్యాదు చేసిన కాంతిలాల్, అతని కుమారులు శక్తి, రాజు లు కూడా ఉన్నారు. కాగా పోలీసులు వెతుకుతున్న సింగ్ కుమారుడు పరారీలో ఉన్నాడు.

బచోడ్ గ్రామ ప్రధాన్ విశాల్ బర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, “ఆ కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉంది. కొడుకు ఆచూకీ లభించకపోవడంతో వాళ్ళు ఆందోళనగా ఉన్నారు.ఇప్పుడు ఆ కుటుంబంలో తండ్రి తప్ప ఎవరూ లేరు. గ్రామంలో జరిగిన అత్యంత విషాదకరమైన సంఘటన ఇది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, పోలీసులతో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

మెహక్ సింగ్ పిర్యాదు మేరకు చప్రౌలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నరేష్ పాల్ , కాంతిలాల్, అతని కుమారులు శక్తి, రాజులపై IPC సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

హత్రాస్ ఎస్పీ నీరజ్ జాదౌన్ మాట్లాడుతూ, “ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది మరియు నిష్పాక్షికమైన విచారణ కోసం కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించాం.” అని చెప్పారు.

కిడ్నాప్ పిర్యాదు వచ్చిన వెంటనే, పోలీసులు సింగ్ తమ్ముడు సంజయ్‌ను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారని కుటుంబం ఆరోపించింది.

First Published:  27 May 2022 2:04 AM GMT
Next Story