Telugu Global
NEWS

నేడే `సామాజిక బస్సుయాత్ర` 

నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్త పర్యటనకోసం నేటినుంచి బస్సుయాత్ర మొదలు పెడుతున్నారు వైసీపీ నేతలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17మంది మంత్రులు ఈ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఇతర నాయకులు వారిని అనుసరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగురోజులపాటు పర్యటన చేపట్టిన నేతలు.. నాలుగు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటారు. శ్రీకాకుళంతో మొదలవుతున్న ఈ యాత్ర.. అనంతపురంతో ముగుస్తుంది. శ్రీకాకుళం సెవెన్‌ రోడ్స్‌ జంక్షన్‌ లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభిస్తారు. […]

ysrcp bus tour
X

నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్త పర్యటనకోసం నేటినుంచి బస్సుయాత్ర మొదలు పెడుతున్నారు వైసీపీ నేతలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17మంది మంత్రులు ఈ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఇతర నాయకులు వారిని అనుసరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగురోజులపాటు పర్యటన చేపట్టిన నేతలు.. నాలుగు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటారు. శ్రీకాకుళంతో మొదలవుతున్న ఈ యాత్ర.. అనంతపురంతో ముగుస్తుంది. శ్రీకాకుళం సెవెన్‌ రోడ్స్‌ జంక్షన్‌ లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభిస్తారు.

రాష్ట్ర మంత్రుల్లో 70శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 80శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. ఈ విషయాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకే సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు వైసీపీ నేతలు. జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని, గతంలో చంద్రబాబు చేసిన సామాజిక అన్యాయాన్ని ప్రజలకు వివరించి చెబుతామంటున్నారు. యాత్ర తొలిరోజున విజయనగరం, ఈనెల 27న రెండో రోజు రాజమహేంద్రవరం, 28న మూడో రోజు నరసరావుపేట, 29న నాలుగో రోజు అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు.

అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన సీఎం జగన్, మంత్రి వర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఏకంగా 70 శాతం పదవులు ఆయా వర్గాలకు కేటాయించారని, దేశ చరిత్రలోనే ఇది ఓ సంచలనం అని అంటున్నారు మంత్రులు. ఓ రాష్ట్రానికి హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. పదవుల విషయంలో న్యాయం చేశారని, పథకాల విషయంలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ విషయాలన్నిటినీ ప్రజలకు వివరించి చెప్పేందుకే యాత్ర చేపట్టామని చెబుతున్నారు.

ALSO REDA: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతకలహాలు సృష్టించబోతున్నారా ?

First Published:  25 May 2022 8:47 PM GMT
Next Story