Telugu Global
Cinema & Entertainment

ఐటెంసాంగ్ తో అదరగొట్టిన జాక్వెలిన్

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ `విక్రాంత్ రోణ‌`. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో అనుప్‌ భండారి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రా రా రాక్కమ్మా.. అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో గ‌దాంగ్ రాక్క‌మ్మా పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ డాన్స్ చేసింది. […]

ఐటెంసాంగ్ తో అదరగొట్టిన జాక్వెలిన్
X

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ 'విక్రాంత్ రోణ‌'. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో అనుప్‌ భండారి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రా రా రాక్కమ్మా.. అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో గ‌దాంగ్ రాక్క‌మ్మా పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ డాన్స్ చేసింది. జాక్వ‌లైన్‌ చేసిన ఈ ఐటెంసాంగ్ ను విక్రాంత్ రోణ మూవీ నుంచి తొలి లిరికల్ వీడియోగా రిలీజ్ చేశారు.

త్రీడీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన విక్రాంత్ రోణ టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమాపై ఉన్న అంచ‌నాలు పెరిగాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే క్ర‌మంలో సినిమా నుంచి ‘రా రా రాక్కమ్మా’ అనే ఫుట్ ట్యాపింగ్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ‌దాంగ్ రాక్క‌మ్మ పాత్ర‌ధారిగా బాలీవుడ్ స్టార్ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మెస్మ‌రైజ్ చేస్తుంది. మంగ్లీ, న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. సాంగ్ చూస్తే ఓ పార్టీ సాంగ్ అని తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవ‌ల్లో మాస్ ఆడియెన్స్‌కు ఈ సాంగ్ కనెక్ట్ అవుతుందని చెబుతోంది జాక్వెలిన్. అటు సుదీప్ కూడా ఈ పాటపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

విక్రాంత్ రోణ చిత్రాన్ని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 28న థియేటర్లలోకి రాబోతోంది విక్రాంత్ రోణ.

First Published:  26 May 2022 12:48 AM GMT
Next Story