Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు తెరపైకి వీరభద్రం చౌదరి

దర్శకుడు వీరభద్రం చౌదరి మరోసారి తెరపైకొచ్చాడు. ఈసారి మరో కొత్త సినిమా ప్రకటించాడు. సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా వీరభద్రం సినిమా ఈరోజు లాంఛ్ అయింది. జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం రానుంది. క్రైమ్ కామెడీ జోనర్ లో రాబోతోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. జులై నుంచి షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. అనూప్ […]

ఎట్టకేలకు తెరపైకి వీరభద్రం చౌదరి
X

దర్శకుడు వీరభద్రం చౌదరి మరోసారి తెరపైకొచ్చాడు. ఈసారి మరో కొత్త సినిమా ప్రకటించాడు. సేనాపతి చిత్రంతో ప్రశంసలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా వీరభద్రం సినిమా ఈరోజు లాంఛ్ అయింది. జయదుర్గాదేవి మల్టీమీడియా, డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రం రానుంది.

క్రైమ్ కామెడీ జోనర్ లో రాబోతోన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. జులై నుంచి షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

అనూప్ రూబెన్స్, వీరభద్రంది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పూలరంగడు పాటలు మంచి సక్సెస్ అయ్యాయి. అందుకే ఆ సెంటిమెంట్ తో అనూప్ ను మరోసారి రిపీట్ చేశాడు ఈ దర్శకుడు. సినిమాకు సంబంధించి స్క్రీన్ ప్లే పూర్తయిందని ప్రకటించాడు.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. హీరోయిన్ డీటెయిల్స్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను ఒకేసారి ప్రకటించబోతున్నారు.

First Published:  26 May 2022 9:58 AM GMT
Next Story