Telugu Global
Cinema & Entertainment

ఎఫ్3 లో అందరికీ లవ్ ఉంటుంది

ఎఫ్2 సినిమాలో వరుణ్ తేజ్, మెహ్రీన్ ప్రేమించుకుంటారు. మరి ఎఫ్3 లో ఆ లవ్ ట్రాక్ ఎవరిది? ప్రస్తుతానికి అది సస్పెన్స్ అంటున్నాడు హీరో వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం వెల్లడించాడు. ఈ సినిమాలో అందరూ ప్రేమలో ఉంటారట. “ఎఫ్3కి సంబంధించి ఆల్రెడీ ఓ పాట వచ్చింది. అందులో జాగ్రత్తగా గమనిస్తే నేను మెహరీన్ కు కొంచెం దూరంలోనే వుంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ వుంది. అయితే అమ్మాయి-అబ్బాయి లవ్ కాదు. డబ్బు […]

VarunTej
X

ఎఫ్2 సినిమాలో వరుణ్ తేజ్, మెహ్రీన్ ప్రేమించుకుంటారు. మరి ఎఫ్3 లో ఆ లవ్ ట్రాక్ ఎవరిది? ప్రస్తుతానికి అది సస్పెన్స్ అంటున్నాడు హీరో వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఒక విషయం మాత్రం వెల్లడించాడు. ఈ సినిమాలో అందరూ ప్రేమలో ఉంటారట.

“ఎఫ్3కి సంబంధించి ఆల్రెడీ ఓ పాట వచ్చింది. అందులో జాగ్రత్తగా గమనిస్తే నేను మెహరీన్ కు కొంచెం దూరంలోనే వుంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ వుంది. అయితే అమ్మాయి-అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద వుండే లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. ఇలా అన్ని పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి.”

ఇలా అసలు మేటర్ ను బయటపెట్టాడు వరుణ్ తేజ్. ఎఫ్2లో వరుణ్-వెంకీ కో-బ్రదర్స్ గా కనిపించారు. ఎఫ్3లో మాత్రం రియల్ బ్రదర్స్ గా నటించారట. అంతేకాదు, ఎఫ్2లో వెంకీకి భార్యగా తమన్నా నటించింది. ఎఫ్3లో మాత్రం పెళ్లికాని ప్రసాదు పాత్రలో కనిపిస్తాడట వెంకీ.

ALSO READ: ఎఫ్ 3 నీరసం వెనక కారణాలు ఇవేనా?

First Published:  26 May 2022 10:06 AM GMT
Next Story