Telugu Global
NEWS

నేడు హైదరాబాద్ కి మోదీ.. బెంగళూరుకి కేసీఆర్

ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రతిష్టాత్మక ISBని సందర్శిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్తారు మోదీ. ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాన్వొకేషన్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. విద్యార్థులను వడపోసి, కొంతమందిని ఈ కార్యక్రమానికి దూరంగా పెట్టారు. ఇక ప్రధాని […]

modi, KCR
X

ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రతిష్టాత్మక ISBని సందర్శిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత చెన్నైలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్తారు మోదీ. ప్రధాని పర్యటనతో హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాన్వొకేషన్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. విద్యార్థులను వడపోసి, కొంతమందిని ఈ కార్యక్రమానికి దూరంగా పెట్టారు.

ఇక ప్రధాని హైదరాబాద్ కి వస్తున్న వేళ.. సీఎం కేసీఆర్ మాత్రం ఇక్కడ ఉండటం లేదు. కేసీఆర్ ఇదేరోజు కర్నాటక టూర్ పెట్టుకున్నారు. బెంగళూరుకి వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో పర్యటించి ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం అవుతున్న కేసీఆర్.. ఇప్పుడు కర్నాటకలో జేడీఎస్ అధినాయకత్వాన్ని కలవబోతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. తదితరులతో సమావేశం అయ్యారు కేసీఆర్. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమికి ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కర్నాటకలో దేవెగౌడ, కుమారస్వామిని కలవబోతున్నారు.

బెంగళూరులో కేసీఆర్ కి ఘన స్వాగతం..
ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేని కలిసిన సందర్భంలో ముంబైలో కేసీఆర్ కి స్వాగతం చెబుతూ భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడు బెంగళూరులో కూడా సీఎం కేసీఆర్‌ కి వెల్కమ్ చెబుతూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘దేశ్‌ కీ నేత కేసీఆర్‌..’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)కాస్తా, భారత రాష్ట్ర సమితి (BRS) కావాలంటూ అభిమానులు ఫ్లెక్సీల ద్వారా తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.

ALSO READ: ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి.. జూన్ 23న ఆత్మకూరు ఉప ఎన్నిక

First Published:  25 May 2022 8:19 PM GMT
Next Story