Telugu Global
Cinema & Entertainment

బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టిన సంగీత దర్శకుడు

టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. ఇప్పటికే ఎన్నో సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ మ్యూజిక్ డైరక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చాలామందికి ఈ విషయం తెలియదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యాక్ గ్రౌండ్ ను బయటపెట్టాడు శ్రీచరణ్ పాకాల. “నేను ఇండస్ట్రీ కి వస్తానని అనుకోలేదు. మా అమ్మగారు చక్కగా పాడతారు. ఆమె ద్వారా గజల్స్ ఎక్కువగా విన్నాను. ఘంటసాల గారి పాటలు, రఫీ, […]

బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టిన సంగీత దర్శకుడు
X

టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. ఇప్పటికే ఎన్నో సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ మ్యూజిక్ డైరక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చాలామందికి ఈ విషయం తెలియదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బ్యాక్ గ్రౌండ్ ను బయటపెట్టాడు శ్రీచరణ్ పాకాల.

“నేను ఇండస్ట్రీ కి వస్తానని అనుకోలేదు. మా అమ్మగారు చక్కగా పాడతారు. ఆమె ద్వారా గజల్స్ ఎక్కువగా విన్నాను. ఘంటసాల గారి పాటలు, రఫీ, ఓపీ నయ్యర్ ఇలా చాలా మంది మ్యూజిక్ వినేవాడిని. ఇంటర్ తర్వాత చదువుపై ఆసక్తిపోయింది. చదువుతావా లేదా ని ఇంట్లో మందలించారు. అలాంటి సమయంలో సడన్ గా సంగీతం పై ఆసక్తి పెరిగింది. అన్నయ్య గిటార్ ప్లే చేసేవారు. ఆయన కొన్ని గిటార్ కార్డ్స్ నేర్పించారు. తర్వాత నాకు నేనే పాఠాలు నేర్చుకుంటూ రాత్రి పగలు తేడా లేకుండా గిటార్ ప్రాక్టీస్ చేసేవాడని. బ్యాండ్ లో జాయిన్ అయ్యాను. హోటల్స్ లో వాయించా. కాలేజీ ఈవెంట్స్ చేశాం. 2007లోనే మా పాట ఇంటర్ నేషనల్ రేడియో లో వచ్చింది. తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ చేశాం. క్షణం దర్శకుడు రవికాంత్ కి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. రవికాంత్ ‘కిస్’ సినిమాకి సహాయ దర్శకుడిగా చేసేవారు. ఆ సినిమా కోసం సంగీత దర్శకుడిని వెదుకుతున్న క్రమంలో నన్ను సంప్రదించారు. మొదట ఒక పాట ఇచ్చాను. అది నచ్చి మిగతా పాటలు, బీజీఎం కూడా చేయించారు. అలా జర్నీ మొదలయింది.”

ఇలా తన మ్యూజికల్ జర్నీని బయటపెట్టాడు శ్రీచరణ్ పాకాల. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు మేజర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కెరీర్ లో తొలిసారి మేజర్ లాంటి పాన్ ఇండియా సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉందన్నాడు. పైగా తన కెరీర్ లో ఇదే తొలి బయోపిక్ అనే విషయాన్ని కూడా బయటపెట్టాడు.

ఈ సందర్భంగా తనను నమ్మిన హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్కకు థ్యాంక్స్ చెప్పాడు శ్రీచరణ్ పాకాల. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు అల్లరి నరేష్ తో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, క్షణం దర్శకుడితో మరో సినిమా, గూఢచారి-2 సినిమాలకు వర్క్ చేస్తున్నాడు. వీటితో పాటు నాంది దర్శకుడితో ఓ సినిమా, తెలిసినవాళ్ళు అనే టైటిల్ తో వస్తున్న మరో సినిమాకు, ఎవరు సినిమా కన్నడ వెర్షన్ కు సంగీతం అందిస్తున్నాడు.

ALSO READ: థాంక్యూ టీజర్ రివ్యూ

First Published:  26 May 2022 12:45 AM GMT
Next Story