Telugu Global
NEWS

ప్రధాని పర్యటన... హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే...

ఇవ్వాళ్ళ హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఆయన గచ్చిబౌలి లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ (ఐఎస్‌బీ ) లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్ట్ కు మోదీ చేరుకుంటారు. అక్కడ 20 నిమిషాల సేపు స్థానిక బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం హెలీకాప్టర్ లో ఐఎస్ బీ కి వెళ్తారు. అక్కడ ఆయన స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 […]

ప్రధాని పర్యటన... హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే...
X

ఇవ్వాళ్ళ హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఆయన గచ్చిబౌలి లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ (ఐఎస్‌బీ ) లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు బేగంపేట ఏయిర్ పోర్ట్ కు మోదీ చేరుకుంటారు. అక్కడ 20 నిమిషాల సేపు స్థానిక బీజేపీ నేతలతో సమావేశమవుతారు. అనంతరం హెలీకాప్టర్ లో ఐఎస్ బీ కి వెళ్తారు. అక్కడ ఆయన స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం వచ్చి చెన్నైవెళ్తారు.

అయితే ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు.

ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్ళింపుల వివరాలు:

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ఎడమ వైపు మలుపు తీసుకుని కొండాపూర్‌ ఏరియా దవాఖాన, మసీద్‌ బండ, మసీద్‌ బండ కమాన్‌, హెచ్‌సీయూ డిపో రోడ్డు, లింగంపల్లి రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు.

లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనాలు హెచ్‌సీయూ డిపో, మసీద్‌ బండ కమాన్‌, మసీద్‌ బండ, కొండాపూర్‌ ఏరియా దవాఖాన, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ మీదుగా మళ్ళించారు.

విప్రో నుంచి లింగంపల్లి వైపు వచ్చే వాహనాలు.. విప్రొ జంక్షన్‌, క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్‌ రోడ్డు, హెచ్‌సీయూ వెనుకాల గేటు, నల్లగండ్ల, లింగంపల్లి రోడ్డుకు డైవర్ట్ చేశారు.

కేబుల్‌ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు.. కేబుల్‌ బ్రిడ్జిపై ర్యాంపు, రోడ్డు నం.45 రత్నదీప్‌, మాదాపూర్‌ పీఎస్‌, సైబర్‌ టవర్స్‌, హైటెక్స్‌, కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి జంక్షన్‌ మార్గం మీదుగా దారి మల్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఐఎస్‌బీ, గచ్చిబౌలి స్టేడియం వద్ద డ్రోన్‌ల నిషేధంతోపాటు 5 కిలోమీటర్ల వరకు డ్రోన్‌లు ఎగురవేయొద్దని సూచించారు. గచ్చిబౌలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, గచ్చిబౌలి స్టేడియం, పరిసరాల చుట్టూ 5 కిలోమీటర్ల వరకు డ్రోన్‌ కెమెరాలు, మైక్రో లైట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, పారా గ్లెడర్స్‌ ఎగుర వేయడాన్ని నిషేధించారు.

ALSO READ: నేడు హైదరాబాద్ కి మోదీ.. బెంగళూరుకి కేసీఆర్

First Published:  25 May 2022 10:03 PM GMT
Next Story