Telugu Global
Cinema & Entertainment

జూన్ 1 నుంచి 'పక్కా'గా ప్రమోషన్

జులై 1న పక్కా కమర్షియల్ అనే సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు అంటే జూన్ 1 నుంచి ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టబోతున్నారు. ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా ఇది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యానర్లపై బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. […]

జూన్ 1 నుంచి పక్కాగా ప్రమోషన్
X

జులై 1న పక్కా కమర్షియల్ అనే సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు అంటే జూన్ 1 నుంచి ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టబోతున్నారు. ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తర్వాత ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా ఇది. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యానర్లపై బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. ఈ
మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.

సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశాడు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌ేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  26 May 2022 9:52 AM GMT
Next Story