Telugu Global
NEWS

అమలాపురం ఘటనపై హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు

అమలాపురం ఘటనపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు .రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మంత్రి , ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగలబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని పోలీసుల తీరు చూస్తుంటే దగ్గరుండి ఆందోళనకారులను ప్రోత్సహించినట్లు అనిపిస్తోందని హర్షకుమార్ విమర్శించారు. పరిస్థితి ఇంత దూరం వచ్చే వరకు ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన […]

harsha kumar
X

అమలాపురం ఘటనపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు .రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలు ఏమాత్రం బాగా లేవని అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక మంత్రి , ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగలబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని పోలీసుల తీరు చూస్తుంటే దగ్గరుండి ఆందోళనకారులను ప్రోత్సహించినట్లు అనిపిస్తోందని హర్షకుమార్ విమర్శించారు.

పరిస్థితి ఇంత దూరం వచ్చే వరకు ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెట్టారు అంటే అది ఆషామాషీ అంశం కాదని వ్యాఖ్యానించారు. అల్లర్లు జరిగినప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలో పోలీసులకు బాగా తెలుసు అని , పరిస్థితిని బట్టి లాఠీ ఛార్జ్ చేయడం ,టియర్ గ్యాస్ ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరగడం , పరిస్థితి మించిపోతే కాల్పులు జరగడం వంటివి కూడా పోలీసులు అనుసరిస్తున్నారని , కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని హర్షకుమార్ విమర్శించారు. పోలీసులు ప్రేక్షకుల చూస్తూ ఉండిపోయి, చివరకు పోలీసులు కూడా పారిపోయే పరిస్థితి వస్తే రాష్ట్రంలో ఇక ప్రజలను కాపాడేవారు ఎవరని హర్షకుమార్ ప్రశ్నించారు.

జిల్లాకు అంబేద్కర్ పేరు ప్రభుత్వం ప్రకటించిన విధానాన్ని కూడా హర్షకుమార్ తప్పుపట్టారు . జిల్లాల ఏర్పాటుకు ముందు నుంచే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్ ఉందని అప్పుడే అన్ని జిల్లాలతో పాటు ఈ జిల్లాకు కూడా పేరు పెట్టి ఉంటే ఈ వివాదం తలెత్తితేది కాదని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.

తొలుత అంబేద్కర్ పేరు పెట్టకుండా తొక్కిపెట్టిన ప్రభుత్వం చివరకు దళితుల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని గమనించి ప్రకటన చేసిందన్నారు. జిల్లా పేరును నేరుగా ప్రకటించకుండా 30 రోజులు అభ్యంతరాల స్వీకరణ గడువు ఇవ్వడంతో వివాదానికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తూ సాగిన ఉద్యమం వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీల వారు ఉన్నారని, అన్ని పార్టీల నాయకులు తెరవెనుక ఆందోళనకారులకు మద్దతు తెలిపారని కూడా హర్షకుమార్ ఆరోపించారు.

ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఇలా ఆందోళనలు జరిగితే దళితుల్లో తమ పట్ల సానుకూలత పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం చూస్తూ ఉండి పోయింది అని కూడా హర్షకుమార్ వ్యాఖ్యానించారు. వైసిపి సంకుచిత రాజకీయాల వల్ల జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వానికి ఆ క్రెడిట్ దక్కకుండా పోయింది అని అభిప్రాయపడ్డారు. అమలాపురం ప్రజలు ధైర్యంగా ఉండాలని , ఇలాంటి విధ్వంసాలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి బయటకు పట్టుకొచ్చి కొట్టాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు.

First Published:  26 May 2022 4:04 AM GMT
Next Story