Telugu Global
NEWS

మహిళా అంపైర్లతో మహిళా టీ-20 భారత మహిళా అంపైర్లతోనే చాలెంజర్ సిరీస్

భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం చోటు చేసుకొంది. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న 2022 మహిళా చాలెంజర్ టీ-20 టోర్నీ ద్వారా ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. గత మూడేళ్లుగా జరిగిన చాలెంజర్ సిరీస్ టోర్నీలలో పురుష అంపైర్లే అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ..ప్రస్తుత 2022 టోర్నీలో మాత్రం మహిళా టోర్నీని మహిళా అంపైర్లే నిర్వహించేలా భారత మహిళా క్రికెట్ సంఘెం చర్యలు చేపట్టింది. బృందా, జననీ, […]

మహిళా అంపైర్లతో మహిళా టీ-20 భారత మహిళా అంపైర్లతోనే చాలెంజర్ సిరీస్
X

భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఓ అద్భుతం చోటు చేసుకొంది. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరుగుతున్న 2022 మహిళా చాలెంజర్ టీ-20 టోర్నీ ద్వారా ఓ అరుదైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది.

గత మూడేళ్లుగా జరిగిన చాలెంజర్ సిరీస్ టోర్నీలలో పురుష అంపైర్లే అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. అయితే ..ప్రస్తుత 2022 టోర్నీలో మాత్రం మహిళా టోర్నీని మహిళా అంపైర్లే నిర్వహించేలా భారత మహిళా క్రికెట్ సంఘెం చర్యలు చేపట్టింది.

బృందా, జననీ, లక్ష్మీ….

సూపర్ నోవాస్, ట్రైల్ బ్లేజర్స్,వెలాసిటీ జట్లతో నాలుగు మ్యాచ్ లుగా నిర్వహిస్తున్న 2022 చాలెంజర్ టీ-20 సిరీస్ లోని మొత్తం నాలుగుమ్యాచ్ ల్లోనూ మహిళలే మ్యాచ్ రిఫరీ, అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

సూపర్ నోవాస్- వెలాసిటీ, ట్రైల్ బ్లేజర్స్- సూపర్ నోవాస్ జట్ల మధ్య జరిగిన మొదటి రెండు మ్యాచ్ ల్లోనూ..భారత్ కే చెందిన బృందా రాఠీ, నారాయణన్ జననీ, జీఎస్. లక్ష్మీ ఫీల్డ్ అంపైర్లుగా, మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వర్తించారు.

ఇదే మొదటిసారి…

భారత్ వేదికగా గత నాలుగు సంవత్సరాలుగా బీసీసీఐ నిర్వహిస్తూ వస్తున్న చాలెంజర్ టీ-20 సిరీస్ లో మహిళలే మ్యాచ్ రిఫరీ, అంపైరింగ్ బాధ్యతలు చేపట్టడం, విజయవంతంగా నిర్వర్తించడం ఇదే మొదటిసారని అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీ జీఎస్ లక్ష్మి గుర్తు చేశారు. ఇదో శుభపరిణామమని, భారత మహిళలూ అంతర్జాతీయ ప్రమాణాలతో అంపైరింగ్, మ్యాచ్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తించగలరని తేటతెల్లమయ్యిందంటూ మురిసిపోయారు.

మొత్తం 40 ఓవర్ల మ్యాచ్ ను ఫీల్డ్ అంపైర్లు జననీ, బృందా ఏమాత్రం ఒత్తిడి లేకుండా..అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించడం భారత మహిళా క్రికెట్ కే గర్వకారణమని వెటరన్ అంపైరింగ్ కోచ్ డెన్నిస్ బర్న్స్ కొనియాడారు.

2020 సంవత్సరానికి ఐసీసీ డెవలెప్ మెంట్ ప్యానెల్ అంపైర్లుగా జననీ, బృందా గుర్తింపు తెచ్చుకొన్నారు.
2018 సీజన్ నుంచి మహిళా టీీ-20 చాలెంజర్ సిరీస్ నిర్వహిస్తున్నా…పురుషులే అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు.

పూర్తిగా మహిళా సిబ్బందితో రైళ్లు, అంతర్జాతీయ విమానసర్వీసులు నడుస్తున్న ఈ రోజుల్లో మహిళా టీ-20 క్రికెట్ మ్యాచ్ లను మహిళా అంపైర్లతోనే నిర్వర్తించడం కాస్త లేటుగానే …అయినా లేటెస్టుగా అనుకోక తప్పదు మరి.

First Published:  25 May 2022 1:05 AM GMT
Next Story