Telugu Global
Cinema & Entertainment

థాంక్యూ టీజర్ రివ్యూ

నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “థ్యాంక్యూ“. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. “మనం” సినిమాతో చైతూకు మెమొరబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ “థ్యాంక్యూ” చిత్రంతో చైతూకు మరో హిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను జూలై […]

థాంక్యూ టీజర్ రివ్యూ
X

నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “థ్యాంక్యూ“. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గౌర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. “మనం” సినిమాతో చైతూకు మెమొరబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ “థ్యాంక్యూ” చిత్రంతో చైతూకు మరో హిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్‌ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ రోజు టీజర్ ను విడుదల చేశారు.

“థ్యాంక్యూ” టీజర్ చూస్తే…బిజినెస్ టైకూన్ అభిరామ్ పాత్రలో నాగచైతన్య కనిపిస్తున్నాడు. ఓ సాధారణ కుర్రాడి నుంచి ఈ స్థాయికి ఆయన ఎదిగినట్లు చూపించారు. ఈ ప్రయాణంలో అతనికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం ఏర్పడింది. గెలుపు పరుగులో తనతో తానే, తనకు తానే అయ్యాడు.

“నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్ లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు” అంటూ హీరోయిన్ వాయిస్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. ఆ మాటలే అభిరామ్ లో మార్పు తీసుకొచ్చాయి. “అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను, ఇక లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే” అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ టీజర్ కు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. ఓ సక్సెస్ ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.

లెజండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి నవీన్‌నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

First Published:  25 May 2022 10:04 AM GMT
Next Story